‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఫిక్స్
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ మూవీ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్కు సిద్ధంగా ఉన్నా సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండడంతో వాయిదా వేశారు. కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. సమంతకు జోడీగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు.