• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ జోకర్: రోజా

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో మంత్రులను తిట్టడానికే పవన్‌ సభ పెట్టారు. ఆయన్ను ఏమనాలో కూడా అర్థంకావడం లేదు. ఆయనోక పొలిటికల్ జోకర్. సంక్రాంతి పండగకు చిరంజీవికి వాల్తేరు వీరయ్య కలెక్షన్లు, బాలయ్యకు వీరసింహారెడ్డి కలెక్షన్లు వస్తే పవన్‌కు చంద్రబాబు నుంచి ప్యాకేజీ వచ్చింది అంటూ ఎద్దేవా చేశారు.

    చంద్రబాబు ఆడిస్తే పవన్ ఆడుతున్నారు: రోజా

    పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నారని మంత్రి రోజా ఆరోపించారు. ఆయన ఏ స్క్పిప్టు ఇస్తే అదే చదువుతున్నారని విమర్శించారు. ’71 వేల ఎకరాలను పేదల ఇళ్ల స్థలాల కోసం పంచిన ఘనత జగన్‌దే. దేశంలో ఏ సీఎం అయినా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారా?. ప్రధానితో రాష్ట్రం కోసం పవన్‌ ఏం మాట్లాడారో ఎందుకు చెప్పలేదు?. అసలు మోదీతో ఏనాడైనా రాష్ట్రం కోసం పవన్ మాట్లాడారా? ఏపీ ప్రయోజనాల కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారు’ అని మంత్రి రోజా అన్నారు.

    చంద్రబాబు డేరా బాబా కంటే డేంజర్: రోజా

    AP: టీడీపీ హయాంలో రాజకీయ నాయకులతో పాటు ప్రజల డేటా చోరీ జరిగిందని మంత్రి రోజా ఆరోపించారు. సేవా మిత్రా యాప్‌ ద్వారా డేటాను దొంగిలించారని విమర్శించారు. ‘చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్ కొన్నారని సీఎం మమతా బెనర్జి చెప్పారు. డేటా చోరీపై సమగ్ర విచారణ జరపాలి. 30 లక్షల ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగింది. డేటా దొంగ చంద్రబాబు.. డేరా బాబా కంటే డేంజర్’ అని విమర్శించారు.