చీర కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు
ఓ చీర కోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన కర్నాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. మల్లేశ్వరంలోని మైసూర్ సిల్క్ శారీ సెంటర్ డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో ఆ దుకాణానికి మహిళలు పోటెత్తారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. దీంతో నాక్కావాలి అంటే నాక్కావాలి అంటూ ఇద్దరూ పోట్లాటకు దిగారు. జుట్లు పట్టుకుని కొట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting … Read more