• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ ప్రయోగానికి సద్ధమవుతోన్న ఇస్రో

    చంద్రయాన్-3 సక్సెస్ అందించిన ఉత్సాహంతో ఇస్రో మరో భారీ ప్రయోగానికి సద్ధమవుతోంది. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీంతో పాటు ఎక్కువ కాలం ప్రయాణించేందుకు వీలుగా మానవ సహిత అంతరిక్ష నౌకను సైతం సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు. తాము నిర్మించే స్పేస్ స్టేషన్ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎలా ఉపయోగపడుతుందనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    అంతరిక్షంలో రష్యా సినిమా షూటింగ్

    రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో తెరకెక్కిస్తున్న ‘ద ఛాలెంజ్’ మూవీ అంతరిక్షంలో షూటింగ్ జరుపుకుని చరిత్ర సృష్టించింది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌ను 2021 అక్టోబర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో తీశారు. దీంతో అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. యూలియా పెరిస్లిడ్‌తో 12 రోజులపాటు అంతరిక్షంలో షూట్ చేశారు. ఓ కాస్మోనాట్ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్ఎస్‌కు వెళ్లిన డాక్టర్‌గా యూలియా ఈ చిత్రంలో నటించింది.

    75వ‌ స్వాతంత్య్ర వేడుక‌ల సంద‌ర్భంగా అంత‌రిక్షం నుంచి భార‌త్‌కు శుభాకాంక్ష‌లు

    భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర‌ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా, ఇటాలియన్ వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి అంత‌రిక్షం నుంచి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇస్రో చేప‌డుతున్న‌ “గగన్‌యాన్” విజయవంతం కావాలని కోరుతూ వీడియో సందేశాన్ని పంపారు – ఈ వీడియోను అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు షేర్ చేశారు. “ఇస్రోతో మా భాగస్వామ్యాన్ని విస్తరించడం, కలిసి విశ్వాన్ని అన్వేషించడం భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనల కోసం మనందరి లక్ష్యం” అని ఆమె చెప్పారు. ‘గగన్‌యాన్‌’కు సన్నాహాలు పూర్తయ్యాయని, భారత సంతతికి చెందిన మానవులు వచ్చే ఏడాది … Read more