చనిపోయిన స్పైడర్లే రోబోలు
అమెరికాలోని రైస్ యూనివర్సిటీ పరిశోధకలు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. చనిపోయిన స్పైడర్లను( సాలీళ్లు ) తిరిగి ఉపయోగించుకునేలా ఓ కొత్త ఆవిష్కరణ చేశారు. స్పైడర్ మృతదేహాల్లోకి గాలిని జొప్పించడం ద్వారా వాటిని రోబోలుగా వాడుతున్నారు. వీటికి వారు ‘నీక్రోబాటిక్స్’ అని పేరు పెట్టారు. చిన్న చిన్న కీటకాలు పట్టుకోవడంతో పాటు మైక్రో ఎలక్ట్రానిక్స్ లో తమ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.