నేడు సుప్రీం ముందుకు చంద్రబాబు కేసు
సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన చంద్రబాబు పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంలో SLP వేశారు. ఈ కేసును చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదించనున్నారు. కేసు వివరాలను సోమవారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఏపీకి సంబంధించిన కేసు, అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.