• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆసీస్, ప్రొటీస్ కంటే డచ్‌కే ఎక్కువ

  టీ20 వరల్డ్‌కప్‌లో 16 జట్లకు కలిపి 5.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు ఐసీసీ తెలిపింది. విజేత ఇంగ్లండ్‌కు 1.6 లక్షల డాలర్లు, రన్నరప్‌ పాకిస్తాన్‌కు 8 లక్షల డాలర్లు, సెమీస్‌లో ఓడిన భారత్, న్యూజిలాండ్‌లకు చెరో 4 లక్షల డాలర్లు లభిస్తాయి. కాగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా (2.1 డాలర్లు) కంటే నెదర్లాండ్స్ జట్టు ఎక్కువ ప్రైజ్‌మనీ కొట్టేసింది. డచ్ జట్టుకు 2.30 లక్షల డాలర్లు లభిస్తాయి. కాగా ఒక్క మ్యాచ్ ఓటమితో సౌతాఫ్రికా జట్టు సెమీస్ చేరే అవకాశంతో పాటు ఏకంగా 3.7 … Read more

  ఫైనల్‌కు వరుణుడి గండం.. రద్దయితే!

  టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి గండం పొంచి ఉంది. మ్యాచ్ జరిగే ఆదివారం రోజు 95 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం, సోమవారం రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఆదివారం వర్షంపడి మ్యాచ్ ఆగిపోతే.. రిజర్వ్ డే సోమవారం రోజు ఆడిస్తారు. ఆ రోజు కూడా వర్షం పడి మ్యాచ్ కొనసాగే అవకాశం లేకపోతే ఇంగ్లాండ్, పాకిస్థాన్ సంయుక్త విజేతలుగా నిలుస్తాయి. ఇరు జట్లు టైటిల్‌ను పంచుకుంటాయి.

  సూర్య ఎనర్జీ వెనుక అసలు కారణం..!

  ప్రపంచ నెం.1 టీ20 బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ దూకుడైన ఆటతీరు వెనుక డైట్ రహస్యం దాగి ఉందని తెలిసింది. సూర్య అత్యంత ఎనర్జీగా ఉండటానికి కెఫిన్ బూస్ట్ యే కారణమని న్యూట్రిషనిస్ట్ శ్వేతా భాటియా వెల్లడించారు. జంక్ ఫుడ్‌కి సూర్య పూర్తిగా దూరంగా ఉంటాడని మీడియాతో తెలిపారు. ‘చీట్ మీల్స్‌కి సూర్య దూరంగా ఉంటాడు. అతడిలో చురుకుదనం కోసం అధిక కార్బోహైడ్రేట్ కలిగిన ఫుడ్‌ని తగ్గించాం. నట్స్, ఒమేగా 3 ద్వారా కొవ్వు పదార్థాలను ఇస్తున్నాం. చేపలు, మాంసం, గుడ్ల ద్వారా అధిక ప్రొటీన్‌ … Read more

  బ్రదరూ.. నువ్వే నెం.1: కోహ్లీ

  టీమిండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్‌ల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. బంగ్లాతో మ్యాచ్ అనంతరం విరాట్ ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్టు పెట్టాడు. దీనికి సూర్య ‘నిప్పు రాజేశావ్..’ అని కామెంట్ చేశాడు. విరాట్ స్పందిస్తూ.. ‘బ్రదరూ.. నువ్వే నంబర్ 1’ అంటూ బదులిచ్చాడు. ఇటీవలే ఐసీసీ టీ20 ర్యాంకింగ్సులో సూర్య నెం.1 బ్యాట్స్‌మన్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ సంభాషణ ఆసక్తికరంగా మారింది. మీరిద్దరి దోస్తీ ఇలాగే కొనసాగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

  INDvsBAN: అడిలైడ్‌లో పొడి వాతావరణం

  బంగ్లాతో భారత్ మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగిస్తాడని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు. అయితే, గత కొన్ని గంటల నుంచి అడిలైడ్‌లో వర్షం పడట్లేదు. వాతావరణం కూడా నిన్నటితో పోలిస్తే పొడిగానే ఉంది. దీంతో పూర్తి ఓవర్ల పాటు మ్యాచ్‌ని నిర్వహించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ సూచిస్తున్నప్పటికీ వర్షం పడకపోవడం కాస్త ఊరట కలిగించే విషయమని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, ఈ మ్యాచులో టీమిండియా గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.

  మోర్గాన్ రికార్డు బద్దలు కొట్టిన బట్లర్

  ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అత్యధిక పరుగుల రికార్డును ప్రస్తుత కెప్టెన్ జోస్ బట్లర్ బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ 64 పరుగులు చేసిన క్రమంలో ఈ రికార్డు సాధించాడు. మోర్గాన్ పేరిట ఉన్న (2,458 ) అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం జోస్ బట్లర్ 2,468 పరుగులు సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌‌పై ఇంగ్లండ్ గెలిచింది. ఈ విజయంతో సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.

  ఖాతా తెరిచిన పాకిస్థాన్

  టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం గ్రూపు 2 లో భాగంగా జరిగిన రెండు మ్యాచులు ఉత్కంఠ పోరుతో ముగిశాయి. నెదర్లాండ్స్‌పై గెలిచి ఎట్టకేలకు పాకిస్థాన్ ఖాతా తెరిచింది. మరోవైపు జింబాబ్వేపై పైచేయి సాధించి బంగ్లాదేశ్ విజయం సాధించింది. తొలుత బంగ్లాదేశ్, జింబాబ్వేల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. బంగ్లాదేశ్ 150 పరుగులు చేయగా జింబాబ్వే దాదాపు ఛేదించేసినట్లు కనిపించింది. కానీ చివర్లో మ్యాచ్‌ బంగ్లా వైపు తిరిగింది. అటు నెదర్లాండ్స్‌ను 91కే కట్టడి చేసి పాక్ ఛేదించింది. స్కోర్లు BAN: 150/7, … Read more

  T20WC: శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం

  T20WCలో శ్రీలంకపై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్కస్ స్టోనిస్ చెలరేగి ఆడాడు. 18 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆరు సిక్సులు, నాలుగు ఫోర్లతో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఆరోన్ ఫించ్ 31, మ్యాక్స్ వెల్ 23 పరుగులతో రాణించారు. అటు శ్రీలంక బౌలర్లలో ధనుంజయ డీసిల్వా, కరుణ రత్నే,తీక్షణ చెరో వికెట్ పడగొట్టారు. స్కోర్లు ఆస్ట్రేలియా 158/3, శ్రీలంక 157/6.

  T20WC: ఆస్ట్రేలియా టార్గెట్ 158

  టీ-20WCలో భాగంగా జరుగుతున్న సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 158 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక నిర్దేశించింది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక 40, అసలంక 38, ధనుంజయ డీసిల్వా 26 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హజిల్ వుడ్, కమిన్స్, స్టార్క్, అస్టాన్ ఆగర్ తలా ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక స్కోరు 157/6

  ఇలాగైతే పాక్ ఇంటికే; బషర్

  బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోకపోతే పాకిస్తాన్ ఇంటి ముఖం పట్టాల్సిందేనని బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్ జోష్యం చెప్పాడు. ‘‘పాకిస్తాన్ అత్యుత్తమ జట్టు అనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. అద్భుతమైన బౌలింగ్ లైనప్ కలిగి ఉంది. బ్యాటింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. కానీ మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది. మిడిలార్డర్ రాణించకపోతే పాక్ ముందుకెళ్లడం కష్టమే’’ అంటూ పేర్కొన్నాడు. ఇక గ్రూప్2 నుంచి భారత్, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుతాయని చెప్పాడు.