బాంబ్ బ్లాస్ట్ ఘటనలో నిందితుడు అరెస్ట్
కర్ణాటకలోని మంగళూరులో ఇవాళ ఉదయం అనుమానస్పద రీతిలో ఆటో పేలింది. బ్లాస్ట్‌కు గల కారణాలను పోలీసు అధికారులు ఉగ్రకుట్రగా భావించి దర్యాప్తు చేపట్టారు. ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని కర్ణాటక పోలీసులు తేల్చారు. నిందితుడిని శివమొగ్గకు చెందిన మహ్మద్ షరీఖ్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం షరీఖ్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. నిందితుడి ఇంట్లో బాంబు తయారీ మెటీరియల్స్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, జైలు నుంచి వచ్చిన తర్వాత నిందితుడు ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.