• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలలో భారీ వర్షం

    తిరుమలలో భారీ వర్షం కురిసింది.దీంతో దర్శనానికి క్యూలైన్లలో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో శ్రీవారి ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. భక్తులు అతిథిగృహాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత కాస్తా పెరిగింది.

    శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

    తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి నేరుగా భక్తుల్ని అనుమతిస్తున్నారు. దీంతో ఎనిమిది గంటల్లో సర్వదర్శం చేసుకోవచ్చు. నిన్న 66,048 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లుగా తేలింది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను నవంబర్‌ 10న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.

    అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం

    తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్‌ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాలో రికార్డయింది. దీంతో నడక దారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గుంపులు గంపులుగా వెళ్లాలని తెలిపింది. మరో వైపు చిరుత, ఎలుగబంటిని బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.

    గరుడవాహనంపై శ్రీవారు

    తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. స్వామివారిని వీక్షించేందుకు లక్షలాది మంది తిరుమలకు పోటెత్తారు..