• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆర్ బాటలోనే మోదీ

    కేసీఆర్, మోదీ చాలా విషయాల్లో ఒకే రకంగా ఆలోచిస్తారని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. వారి రాజకీయ ప్రయాణం, పరిపాలనా విధానం కూడా దాదాపుగా అలాగే ఉంటుందని అభిప్రాయపడుతుంటారు. వీరిలో ఒకరిది అతి జాతీయవాదమైతే మరొకరిది అతి ప్రాంతీయవాదమని నిపుణుల విశ్లేషణ. అయితే ఎన్నికల వ్యూహాల్లోనూ వీరు ఒకేలా ఆలోచిస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే తెలుస్తోంది. రానున్న ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ చేసిన ఆలోచననే మోదీ కూడా అమలుచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నియామకాలపై నిశ్శబ్ధం వీడి మోత మోగేలా కేసీఆర్ ప్రకటన:  ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ … Read more

    TSPSC గ్రూప్-1 పరీక్ష తేదీలు ఖరారు

    గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకుని పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ శుభవార్త అందించింది. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం జూలై, ఆగస్టులో ప్రిలిమ్స్ నిర్వహించాల్సి ఉన్నా అదే సమయంలో ఆర్బీఐ, పోలీస్, బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు ఉన్నాయి. సెప్టెంబర్ 16నుంచి 22వరకు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ గ్రూప్-1 పోస్టులకు ఆక్టోబర్లో ప్రిలిమ్స్, జనవరి,ఫిబ్రవరిలో మెయిన్స్ నిర్వహిస్తామని పేర్కొంది. రాష్ట్రంలో 503 గ్రూపు-1 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

    కొనసాగుతున్న కొలువుల జాతర..మరో నోటిఫికేషన్

    తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా వైద్య, ఆరోగ్యశాఖలో 1326 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ వివరాలు.. మొత్తం పోస్ట్‌లు 1,326 * సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు- 751 * ట్యూటర్‌ పోస్టులు – 357 * ఐపీఎంలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌- 7 * సివిల్ సర్జన్ జనరల్ ఖాళీలు- 211 దరఖాస్తు ప్రారంభ తేదీ: **15 జూలై 2022** చివరి తేదీ: **14 ఆగస్టు 2022 **