• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బతుకమ్మకు అరుదైన గౌరవం

    తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ‘బతుకమ్మ’ పండగకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని జార్జియాలో బతుకమ్మ పండగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ బ్రెయిన్‌ పి.కెంప్‌ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌ 3వ వారాన్ని బతుకమ్మ వారంగా ప్రకటించారు. ఈ ప్రకటనపై పలువురు తెలంగాణ అసోసియేషన్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగగా బతుకమ్మ గుర్తింపు పొందింది. 12వ శతాబ్దం నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నట్లు ఆధారాలు ఉన్నాయి.

    ఘోరం.. కాల్పుల్లో 22 మంది మృతి

    అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లెవిస్టన్‌, మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో దాదాపు 60 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    మరో ఇద్దరు బందీలను వదిలిపెట్టిన హమాస్

    మరో ఇద్దరు బందీలను హమాస్ మిలిటెంట్లు తమ చెర నుంచి వదిలి పెట్టారు. మానవత దృష్టితో ఇద్దరు వృద్ధులను విడిచి పెట్టినట్లు పేర్కొన్నారు. వీరిద్దరు ఇజ్రాయేల్ దేశస్థులు. వారం క్రితం ఇద్దరు అమెరికాకు చెందిన తల్లి కూతుళ్లను హమాస్ ఉగ్రవాదులు విడిచి పెట్టారు. ప్రస్తుతం తమ వద్ద 222 మంది బందీలుగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు హమాస్‌పై దాడుల ఉద్ధృతిని పెంచనున్నట్లు ఇజ్రాయేల్ ప్రకటించింది. తాము హమాస్‌ పూర్తిగా ధ్వంసం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

    రేపు ఇజ్రాయేల్‌లో జోబైడెన్ పర్యటన

    రేపు ఇజ్రాయేల్‌లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పర్యటించనున్నారు. హమాస్ ఉగ్రదాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయేల్‌కు అండగా నిలిచేందుకే బైడెన్ అక్కడ పర్యటిస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతారు. అనంతరం ఇజ్రాయేల్ నుంచి జోర్డాన్ రాజధాని అమ్మన్‌కు వెళ్తారు. అక్కడ ఆ దేశ రాజు అబ్దుల్లా, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమవుతారు. పాలస్తీన ప్రజల ప్రతినిధులుగా హమాస్‌ను గుర్తించమని ఈ భేటీలో ఆయన ప్రకటించనున్నారు.

    Mahesh Babu’s  ‘Sarkaru Vaari Paata’ Mania in America

    Mahesh Babu’s ‘Sarkaru Vaari Paata’ mania is shaking Telugu film lovers. After a two-and-a-half-year hiatus, Telugu states’ superstar returned to the big screen with his much-anticipated film ‘Sarkaru Vaari Paata.’ The film was released with a lot of positive buzz yesterday. Fans of Mahesh Babu from all over the world are excited over the release of ‘Sarkaru Vaari Paata.’ Mahesh … Read more

    RRR: లాస్ వెగాస్‌లో ఎన్టీఆర్ అభిమానుల రచ్చ

    లాస్ వెగాస్ ప్రపంచ వినోద రాజధాని. అటువంటి చోట RRR సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు చేసిన రచ్చ మామూలుగా లేదు. ప్రపంచలోనే పెద్దదైన బిల్ బోర్డ్స్‌ ‌పైన RRR ప్రోమోను ప్రదర్శించారు. అమెరికాలో ఉంటున్న జూ. ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌లో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన RRR మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇది వరకే ఈ సినిమాను … Read more