వంగవీటి రాధా పెళ్లి.. హాజరైన పవన్
వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధా, పుష్పవల్లిల వివాహ వేడుక ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా పోరంకిలోని M రిసార్ట్స్‌లో జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, కొడాలి నాని, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, జలీల్‌ఖాన్, నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, పలువురు ప్రముఖులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.