• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గురువు మృతితో శిష్యుడి ఎమోషనల్

    కళాతపస్వి, దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ మృతితో ఆయన శిష్యుడు కమల్ హాసన్ ఎమోషనల్ అయ్యారు. విశ్వనాథ్ మృతితో కమల్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు.‘‘విశ్వనాథ్ గురువు గారు కళను, జీవిత పరమార్ధాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఎన్ని రోజులైనా ఆయన కళకు గుర్తింపు ఉంటుంది. ఆయన కళ అజరామరం.’’ అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ‘స్వాతిముత్యం’, ‘శుభసంకల్పం’, ‘ద్రోహి’ వంటి క్లాసిక్ మూవీలు వచ్చాయి. ఈ సినిమాలతో కమల్ సూపర్‌స్టార్‌గా ఎదిగారు.

    విశ్వనాథ్ గారు తండ్రి లాంటివారు; చిరంజీవి

    తనకు కే విశ్వనాథ్ గారు తండ్రి లాంటి వారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీవ్ర లోటని భావోద్వేగానికి గురయ్యారు. కాగా విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ వంటి హిట్ చిత్రాల్లో చిరంజీవి నటించారు. వీరు వ్యక్తిగతంగా కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ‘స్వయంకృషి’ సినిమా షూటింగ్ సమయంలో చిరు [భోజనం](url) చేయకుండా పడుకుంటే..విశ్వనాథ్ స్వయంగా తన చేతులతో పెరుగన్నం కలిపి ఇచ్చారు. Rest In Peace To The Great Legendary Director Shri K.Vishwanath Garu … Read more

    కళాతపస్వికి దర్శకేంద్రుడి నివాళులు

    దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌కు దర్శకేంద్రుడు [కె.రాఘవేంద్రరావు](url) కన్నీటి నివాళులర్పించారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని విశ్వనాథ్ స్వగృహంలోనే ఆయన పార్ధివ దేహం ఉంచారు. కడసారి చూపుల కోసం పలువురు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. కాగా కళాతపస్వి మృతి పట్ల షూటింగ్‌లు అన్నీ బంద్ చేస్తున్నట్లు సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. విశ్వనాథ్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పంజాగుట్ల శ్మశానవాటికలో జరగనున్నాయి. K Raghavendra Rao garu pays last respects to legendary #KVishwanath garu.@Ragavendraraoba #RIPVishwanathGaru pic.twitter.com/9ZWgCjl0tJ — Shreyas Media … Read more

    ఆస్కార్ బరిలో ‘కళాతపస్వి’ చిత్రం

    దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) వృద్ధ్యాప్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. అగ్ర కథానాయకులకు ఆయన దర్శకత్వం వహించి ఎన్నో ఆణిముత్యాలను ఇండస్ట్రీకి అందించారు. వాటిలో ‘స్వాతిముత్యం’, ‘సాగరసంగమం’, ‘శంకరాభరణం’, ‘ఆపద్భాంధవుడు’, ‘శృతిలయలు’, ‘సిరివెన్నెల’, ‘స్వరాభిషేకం’, ‘నేరము-శిక్ష’, వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. [‘స్వాతిముత్యం’](url) సినిమా 59వ ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. Telugu audience can never forget Kamal Hassan's role as an autistic individual in #SwathiMuthyam Only … Read more

    సౌండ్ ఆర్టిస్ట్ టు లెజండరీ డైరెక్టర్

    కళాతపస్వి, లెజండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ (92) వృద్ధాప్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా పెదపులివర్రు. గుంటూరు హిందు కాలేజీలో ఇంటర్, ఏసీ కాలేజీలో డిగ్రీ చదివారు. అనంతరం చెన్నై వెళ్లి విజయవాహినీ స్టూడియోలో సౌండి రికార్డిస్ట్‌గా కెరీర్ ఆరంభించారు. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా మారాడు. తొలి చిత్రానికే ‘నంది’ అవార్డు అందుకున్నాడు. ఆయన 9 బాలీవుడ్ సినిమాలతో కలిపి మొత్తం 50కి పైగా సినిమాలకు దర్శకత్వం చేపట్టారు.