• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాట్సాప్ గు‌డ్‌న్యూస్.. ఆ వివరాలు ట్రాక్‌ చేయలేరు!

    ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గుర్తు తెలీని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను రింగ్‌ అవ్వకుండా సైలెన్స్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్‌ సమయంలో లొకేషన్‌, ఐపీ అడ్రస్‌ వివరాలు అవతలి వారికి తెలీకుండా చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొందరికి అందుబాటులోకి వచ్చింది.. ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ చేయాలంటే త్రీడాట్స్‌ మెనూలోని ప్రైవసీలోకి వెళ్లాలి. ఐపీ అడ్రస్‌ ఇన్‌ కాల్స్‌ అనే ఆప్షన్‌ ఎనేబుల్‌ చేసుకోవాలి.

    వాట్సాప్‌లో మరో ‘వ్యూ వన్’ ఫీచర్

    వాట్సాప్ మారో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇటీవల తీసుకువచ్చిన ‘వ్యూ వన్ ఫీచర్’ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఏదైన ఫొటోలను మీడియోను ఒకసారి మాత్రమే చూడోచ్చు దాన్ని స్క్రీన్‌షాట్ చేయడం కూడా కుదరదు. ఇప్పుడు ఇదే ఫిచర్‌ను వాయిస్ నోట్ ఫార్మాట్‌కు కూడా తీసుకువచ్చింది. వాయిస్ రికార్డును సెండ్ చేసే సమయంలో వ్యూ వన్ ఆప్షన్ ఎంచుకుంటే అది ఒకసారి మాత్రమే వినడానికి వీలుంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

    వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌

    యూజర్లకు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇందులో మన వ్యక్తిగత వాట్సాప్‌ను ఇతరులు ఓపెన్‌ చేసినా సంబంధిత చాట్‌లు వీక్షించకుండా ఒక పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత కల్పించేందుకు ‘సీక్రెట్‌ కోడ్‌’ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది లాక్‌ చేయాలనుకున్న వ్యక్తిగత చాట్‌లన్నింటినీ సీక్రెట్‌కోడ్‌ ద్వారా లాక్‌ చేసేయెచ్చు. వాట్సాప్‌ సెర్చ్‌ బార్‌లో ఎంటర్‌ చేయగానే లాక్‌ వేసిన చాట్స్‌ ఓపెన్‌ అవుతాయి.