• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 25న యాదాద్రి ఆలయం మూసివేత

    TS: పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈ నెల 25న ఉదయం 8.50 గంటలకు మూసివేయనున్నారు. 26వ తేదీ ఉదయం 8గంటలకు సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. 25వ తేదీ సాయంత్రం 4.59గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.28గంటలకు ముగియనుంది. దీంతో పాంచనారసింహుడు కొలువైన ప్రధానాలయం, అనుబంధ దేవాలయాలను ఆరోజున ఉదయం 8.50గంటలకు శయనోత్సవ పర్వాలు నిర్వహించి ద్వారబంధనం చేయనున్నారు.

    యాదాద్రిలో ఒకే రోజు రికార్డు ఆదాయం

    తెలంగాణలోని యాదాద్రి నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే భారీగా ఆదాయం వచ్చింది. మార్చి 28న రూ.45,50,079 వచ్చినట్లు ఆలయ సిబ్బది తెలిపారు. 2022లో ఇప్పటివరకు ఇదే అత్యధిక ఆదాయమని వెల్లడించారు. శని, ఆదివారాల్లో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. మార్చి 28న భక్తులు ఎక్కువగా రావడంతో ధర్మ దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పట్టినట్లు తెలిపారు. మరోవైపు విద్యార్థులకు సెలవులు కూడా రావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నట్లు సమాచారం.

    నేడు యాదాద్రి ఆలయం ప్రారంభం..సాయంత్రం భక్తులకు అనుమతి

    తెలంగాణలోని యాదాద్రిలో పునర్ నిర్మించిన లక్ష్మినరసింహ స్వామి ఆలయాన్ని ఇవాళ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మహాకుంభ సంప్రోక్షణ, ఉద్ఘాటన కార్యక్రమం తర్వాత ఉదయం 11.55 గంటలకు ఆరంభించనున్నారు. ఇప్పటికే ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరోవైపు సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్‌లను ఆహ్వానించారు.