ఒకప్పుడు తెలంగాణ అంటే వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి భూములు నీటితో కావు.. రైతన్న కన్నీటితో తడిచేవని చెప్పుకునేవారు. ప్రభుత్వ ఆసుపత్రి పనికిరాదని, ప్రైవేటు ఆసుపత్రిలో అడుగు పెట్టరాదని వివరించేవారు. ప్రాజెక్టులు పారలేదు. చెరువులేమో నిండలేదు. రోడ్డుపై నడవలేము.. బీడు భూమిపై పంట పండించలేము అన్నట్లుగా ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పరిస్థితి మారింది. ఒకొక్కటిగా అభివృద్ధి బాట పట్టింది. తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చినంక అని మాట్లాడుకునేలా పురోగతి సాధించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంత్రి కేటీఆర్ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. నాడు ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది.. అంటూ అందులో కొన్నింటిని చూపించే ప్రయత్నం చేశారు. మీరూ ఓ లుక్కేయండి.
యాదగిరిగుట్ట.. యాదాద్రి
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదాద్రి అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం గుట్ట మాత్రమే కనిపించేది. కానీ, నేడు సుందర క్షేత్రం వెలసిల్లింది. చూస్తే మెస్మరైజ్ కావాల్సిందే.
ఖమ్మం బస్టాండ్
ఖమ్మం జిల్లా కేంద్రం అయినప్పటికీ బస్టాండ్ ఇరుకుగా ఉండేది. నేడు విశాలంగా రూపుదిద్దుకుంది. 2014లో బస్టాండ్ ఎలా ఉండేది. ఇప్పుడెలా ఉందో మీరే చూడండి.
బోర్డర్ రోడ్డు
మహారాష్ట్ర బోర్డర్‌కి కలిపే రోడ్డుపై నాడు వాహనం వెళ్లాలంటే గగనమే. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ గ్రామం నుంచి బేల మండలంలోని శంకర్‌గూడకు కొత్త రోడ్డును నిర్మించారు.
ట్రైబల్ మ్యూజియం
బ్రిటిష్ తిరగుబాటు నేత కుమురం భీం.. పుట్టిన గ్రామం జోడేఘాట్. ఆయన పోరాటాన్ని స్మరించుకుంటూ ఇక్కడ ట్రైబల్ మ్యూజియంను నిర్మించింది. పూర్తి హంగులతో దీనిని తీర్చిదిద్దింది.
మానేర్ నదిపై హైలెవల్ బ్రిడ్జి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలంలోని షాభాష్‌పల్లె వద్ద మానేర్ నదిపై బ్రిడ్జి అరకొరగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం హైలెవల్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. రాకపోకలను సులువు చేసింది.
కోయిల్‌కొండ హాస్పిటల్
మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్‌కొండ ప్రభుత్వ ఆసుపత్రి అధ్వానంగా ఉండేది. ఆసుపత్రికే రోగం వచ్చిందా అన్నట్లు కనిపించేది. ఇప్పుడు అక్కడ నెలకొన్న ఆసుపత్రి అధునాతన వైద్య సేవలు అందిస్తోంది.
యతిరాజారావ్ పార్క్
మహూబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మున్సిపాలిటీలోని యతిరాజారావ్ పార్క్ నాడు పిచ్చిమొక్కలతో నిండి ఉండేది. నేడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
కేసరిసముద్రం మినీ ట్యాంక్ బండ్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్‌లో 2014లో చుక్క నీరు లేదు. ఇప్పుడు నిండుకుండలా నీటితో కలకలలాడుతోంది.
లంబడి తండా
హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో లంబడి తండా రేకుల ఇళ్లతో నిండి ఉండేది. అక్కడ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి తండావాసులకు శాశ్వత నివాసం కల్పించింది.
2BHK కాలనీ
భూపాలపల్లి మున్సిపాలిటీలోని సింగరేణి ఉద్యోగుల కోసం 2BHK కాలనీని ఏర్పాటు చేశారు.
వరంగల్ రోడ్డు
వరంగల్ జిల్లాలోని నల్లబల్లి, మల్లంపల్లి రోడ్డు రూపురేఖలే మారిపోయాయి.
నిజామాబాద్ ఫైర్ స్టేషన్
2014లో నిజామాబాద్ పట్టణంలోని ఫైర్ స్టేషన్ చిన్న రేకుల షెడ్డులో ఉండేది. నేడు ఎలా ఉందో మీరే చూడండి.
కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్
కరీంనగర్‌లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌ని కూడా ప్రభుత్వం విస్తరించింది.
మిషన్ భగీరథ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకం మిషన్ భగీరథ. ఇంటింటికీ తాగునీరు అందించడమే దీని లక్ష్యం. భూపాలపల్లి జిల్లాలోని మహదేవపురం మండలంలోని నాటి పరిస్థితి ఇలా ఉండేది.
మిడ్ మానేర్ డ్యాం
రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్‌పల్లి మండలంలోని మన్వాడ జిల్లాలో మిడ్ మానేర్ డ్యాం నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది.
అత్యాధునిక మార్కెట్
ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో గతంలో రోడ్డుపైనే మార్కెట్ జరిగేది. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ఇరుకుగా ఉండేది. ప్రస్తుతం విశాలమైన భవనంలో మార్కెట్ వర్తకం జరుగుతోంది.
సిద్దిపేట రైతు బజార్
సిద్దిపేటలో రైతు బజార్ రూపురేఖలే మారిపోయాయి. రేకుల షెడ్డులో ఉండే బజార్ నేడు రెండంతస్తుల భవనంలా మారింది.
మేడిగడ్డ బ్యారేజ్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించింది. 2014లో ఎలా ఉండేదో ఈ చిత్రంలో చూడొచ్చు.
ములుగు ఆసుపత్రి
ములుగులోని సామాజిక ఆసుపత్రికి నూతన భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఇక్కడి ప్రత్యేక అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ములుగును జిల్లాగా ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ పాఠశాలలు
అరకొర వసతులతో ప్రభుత్వ పాఠశాలలు సతమతమయ్యేవి. అవసరమైన చోట్ల బిల్డింగ్‌లు నిర్మిస్తూ ప్రభుత్వం పాఠశాలలను మార్చేసింది.
మధిర మినీ ట్యాంక్‌బండ్
ఖమ్మం జిల్లాలోని మధిర మినీ ట్యాంక్‌బండ్ ముళ్లపొదలతో నిండిఉండేది. ఇప్పుడు ఆహ్లాదకరంగా మారింది.
నాగోబా ఆలయం
ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో కేస్లాపూర్ జాతర ఒకటి. ఇక్కడ నాగోబా దేవతను కొలుస్తారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో ఈ ఆలయం కొలువై ఉంది.
భద్రకాళి బండ్
వరంగల్‌లోని భద్రకాళి బండ్‌ని ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దింది.
సిద్దిపేట కోమటి చెరువు
మినీ ట్యాంక్‌బండ్‌గా పేరుగాంచింది సిద్దిపేట కోమటిచెరువు. ఇక్కడ అడ్వెంచర్ పార్క్‌తో పాటు తీగల వంతెనను ప్రభుత్వం నిర్మించింది.
జిల్లా గ్రంథాయలం
జిల్లా కేంద్రాల్లోని గ్రంథాలయాలను సరికొత్త భవనాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. రాజన్న సిరిసిల్లా జిల్లా గ్రంథాలయం ఇది.
ఎల్బీనగర్ సర్కిల్
2014లో ఎల్బీనగర్ సర్కిల్ సాదాసీదాగా ఉండేది. కానీ, వాహనాల రద్దీ పెరిగిన దృష్ట్యా ఇక్కడ రెండు ఫ్లైఓవర్లతో పాటు అండర్‌పాస్‌లను ప్రభుత్వం నిర్మించింది. సిగ్నల్ రహిత సర్కిల్‌గా నిలిచింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!