వందేభారత్ ట్రైన్‌పై మళ్లీ రాళ్ల దాడి!
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రయాణించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా ప్రయాణిస్తోంది. ఖమ్మం సమీపంలో ఈ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో సీ11 కోచ్‌కు సంబంధించిన అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీంతో రైలును అక్కడే దాదాపు 3 గంటలపాటు నిలివేశారు. రైలు కోచ్ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రస్తుతం వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా ఈ రైలుపై ఇప్పటికే రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది. ఇది మూడోసారి.