బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: హరీశ్ రావు
కేంద్ర బడ్జెట్లో మరోసారి తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బడ్జెట్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. “ అందమైన మాటలు తప్ప… కేటాయింపులు లేని డొల్ల బడ్జెట్. ఏడు ప్రాధాన్యత రంగాలను గాలికి వదిలేశారు. తెలంగాణకు మరోసారి అన్యాయం చేశారు. తొమ్మిదేళ్లుగా అడుగుతున్నా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు. విభజన హామీల అమలు ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు ” అన్నారు.