• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రారంభమైన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం

    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే అల్పాహరం కార్యక్రమం లాంచనంగా ప్రారంభమైంది. ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల ప్రభుత్వ పాఠశాలలో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 27వేల 147 పాఠశాలల్లో దాదాపు 23లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. స్కూలు టైమింగ్‌కు అర్ధగంట ముందు 1-10 వ తరగతి వరకు పిల్లలకు అల్పాహారం అందించనున్నారు.

    రేవంత్ రెడ్డి ఇక జైలుకే: హరీష్ రావు

    ఓటుకు నోటుకు కేసులో త్వరలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కేసులో దొరికిన రేవంత్ రెడ్డి విచారణ ఆపాలని సుప్రీం కోర్టుకు పోతే కోర్టు కూడా విచారణ జరగాలని స్పష్టం చేసింది. ఆ కేసు విచారణ అయ్యేది ఖాయం, రేవంత్ జైలుకు వెళ్లేది ఖాయం అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈనెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ పెడుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రకటించే బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి విపక్షాలు బిక్కమొహం వేస్తాయని పేర్కొన్నారు.

    బీఆర్‌ఎస్ పాలనపై చర్చకు వస్తారా?: హరీష్

    బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ పాలనపై చర్చకు పెడుదామా అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు హరీష్ రావు సవాలు విసిరారు. కాంగ్రెస్ మళ్ళీ వస్తే కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్ల కాలం వస్తుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనకి కాంగ్రెస్ పాలనపై చర్చ పెడుదాం అంటున్నాడు. సోనియాగాంధీని బలి దేవత అని రేవంత్ రెడ్డి అనలేదా. ఇప్పుడు పీసీసీ కుర్చీలో కూర్చొని దేవత అంటున్నాడు అని విమర్శించారు.

    హ్యాట్రిక్‌ కొట్టేది కేసీఆరే: హరీశ్‌రావు

    TG: రాష్ట్ర భాజపాపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి.. అనంతరం మాట్లాడారు. గన్నుతో, పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తి రామలింగారెడ్డి అని కొనియాడారు. దుబ్బాకలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో భాజపా లేచేది లేదు. కాంగ్రెస్‌ గెలిచేది లేదు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా .. హ్యాట్రిక్‌ కొట్టేది సీఎం కేసీఆరే’ అని హరీశ్‌ అన్నారు.

    Then-Now: తెలంగాణ రాకముందు అలా.. వచ్చాక ఇలా.. ఎంత మార్పో మీరే చూడండి..!

    ఒకప్పుడు తెలంగాణ అంటే వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి భూములు నీటితో కావు.. రైతన్న కన్నీటితో తడిచేవని చెప్పుకునేవారు. ప్రభుత్వ ఆసుపత్రి పనికిరాదని, ప్రైవేటు ఆసుపత్రిలో అడుగు పెట్టరాదని వివరించేవారు. ప్రాజెక్టులు పారలేదు. చెరువులేమో నిండలేదు. రోడ్డుపై నడవలేము.. బీడు భూమిపై పంట పండించలేము అన్నట్లుగా ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పరిస్థితి మారింది. ఒకొక్కటిగా అభివృద్ధి బాట పట్టింది. తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చినంక అని మాట్లాడుకునేలా పురోగతి సాధించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంత్రి కేటీఆర్ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. … Read more

    తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి ప్రగతి పథంలో దూసుకెళ్తుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యాంశాలు మొత్తం బడ్జెట్ మంత్రి హరీశ్‌రావు 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల … Read more