• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top 6 Sunroof Cars 2024: బెస్ట్‌ సన్‌రూఫ్‌ కారు కోసం ఎదురు చూస్తున్నారా? వీటిని ట్రై చేయండి!

    దేశంలో కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు డబ్బున్న వారికే పరిమితమైన కార్లపై మధ్య తరగతి కుటుంబాల వారు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. కారు ఫీచర్లపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది సన్‌రూఫ్‌ కార్లపై తమ ఆసక్తిని పెంచుకుంటున్నారు. రైడ్‌ను ఆస్వాదించడానికి సన్‌రూఫ్‌ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తమ పిల్లల కోసం తల్లిదండ్రులు సన్‌రూఫ్‌ కార్లను ప్రిఫర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 10 నాటికి మార్కెట్‌లో ఉన్న టాప్‌-6 సన్‌రూఫ్‌ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    Tata Nexon

    టాటా కంపెనీకి చెందిన కార్లకు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. ఈ కంపెనీకి చెందిన మంచి సన్‌రూఫ్‌ కారును కోరుకునే వారు ‘Tata Nexon’ మోడల్‌ను పరిశీలించవచ్చు. టాటా నెక్సాన్‌ అనేది అత్యాధునిక డిజైన్‌, సేఫ్టీతో కూడిన ఎస్‌యూవీ కారు. నెక్సాన్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్‌లెస్ అనే నాలుగు వేరియంట్‌లలో ఇది లభిస్తుంది. Tata Nexon కారు ధర మోడల్‌ను బట్టి రూ. 8.10 – 15.50 లక్షల మధ్య ఉంటుంది.

    Maruti Suzuki Brezza

    ప్రముఖ వాహన తయారీ సంస్థల్లో మారుతి సుజుకి ఒకటి. ఈ కంపెనీకి చెందిన బ్రెజా (Maruti Suzuki Brezza) మంచి సన్‌రూఫ్‌ కారు అని చెప్పవచ్చు. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVగా దీనికి పేరుంది. బ్రెజా కారు.. 1.5-లీటర్ K15C పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 103bhp గరిష్ట శక్తిని అలాగే 137Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. మారుతి బ్రెజా ఆటోమేటిక్ లేదా మ్యాన్యువల్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ప్రారంభ మోడల్ ధర రూ. 8.29 లక్షలు.

    Hyundai Venue

    హ్యుందాయ్‌ కంపెనీకి చెందిన మంచి SUV కార్లలో ‘Hyundai Venue’ ఒకటి. ఈ కారు అద్భుతమైన సన్‌రూఫ్‌తో పాటు ఫార్వర్డ్‌ కొలిషన్ వార్నింగ్‌, లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌, లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌, డ్రైవర్‌ అటెన్షన్‌ వార్నింగ్‌, లేన్‌ ఫాలోయింగ్‌ అసిస్ట్‌, హై బీమ్ అసిస్ట్‌ అండ్‌ లీడింగ్ వెహికల్‌ డిపార్చర్‌ అలర్ట్‌ వంటి సురక్షిత ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు స్టార్టింగ్‌ ప్రైస్‌ రూ. 7.29 లక్షలు.

    Kia Sonet

    బెస్ట్‌ సన్‌రూఫ్‌ మోడల్‌ కారును కోరుకునే వారు కియా సోనెట్‌ (Kia Sonet)ను పరిశీలించవచ్చు. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటర్ పెట్రోలుకు 18.83 కిమీల మైలేజీ ఇస్తుంది. అధునాతన డ్రైవర్ సిస్టమ్ లేదా ADAS ఈ కారు ప్రత్యేకత. ఇందులో అదనంగా వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా, వెనుక కర్టెన్‌లు తదితర ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.79 లక్షలు.

    Hyundai Exter

    హ్యుందాయ్ తన మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ను గతేడాది రిలీజ్ చేసింది. సన్‌రూఫ్ ఫీచర్‌తో వచ్చిన అత్యంత సరసమైన కార్లలో ఇది ఒకటి. ఇది లీటర్‌కు 20 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. దీని లోపలి భాగం చాలా వరకు i10, ఆరా వాహనాలకు పోలి ఉంటుంది. డ్యాష్‌బోర్డులో 8 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. వాయిస్‌ యాక్టివేటెడ్‌ కమాండ్‌లతో పనిచేసే డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ కూడా ఉంది. మోడల్‌ను బట్టి ఈ కారు ధర రూ.6.13 – 10.28 లక్షల మధ్య ఉంటుంది.

    Hyundai i20 Asta

    ఈ హ్యూండాయ్‌ కారు కూడా ఆకర్షణీయమైన సన్‌రూఫ్‌తో వస్తుంది. 1197 cc ఇంజిన్‌ కలిగిన ఈ కారు 81.8 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్‌కు 16 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. రూ.10 లక్షల బడ్జెట్‌లో దీన్ని పొందవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv