కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన వేళ మరింత పుంజుకునేందుకు ఆటోమెుబైల్ రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు కొత్త సంవత్సరంలో తమ నయా బైక్స్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు మెుదలుపెట్టాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆ బైక్స్‌ను జనవరిలో మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇంతకీ ఈ నెలలో రాబోయే బైక్‌లు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి? ధర ఎంత వరకూ ఉండవచ్చు? వంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Triumph Daytona 660
ప్రముఖ ఆటోమెుబైల్ కంపెనీ ట్రియంప్ 2024లో తన తొలి బైక్‌ను లాంచ్ చేయబోతోంది. ‘Triumph Daytona 660’ బైక్‌ను జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 81bhp సామర్థ్యం కలిగిన 660cc ఇంజిన్‌తో ఈ బైక్ రాబోతోంది. దీని ధర రూ.11-12 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. లాంచింగ్ రోజునే ఇతర ఫీచర్లపై స్పష్టత రానుంది.
Suzuki V-Strom 800DE
సుజూకి నుంచి మరో పవర్‌ఫుల్ బైక్ ఈ నెలలో రాబోతోంది. Suzuki V-Strom 800DE బైక్ జనవరి 13న లాంచ్ అయ్యే అవకాశముంది. ఇది 776 cc ఇంజిన్, 6 స్పీడ్ మ్యానువల్స్, 20 లీటర్ల ఫుయల్ ట్యాంక్ వంటి ఫీచర్లతో లాంచ్ కానుంది. దీని ధర కూడా రూ.11-12లక్షల మధ్య ఉంటుందని ఆటోమెుబైల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Royal Enfield Shotgun 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ సైతం కొత్త ఏడాదికి పవర్‌ఫుల్ బైక్‌తో స్వాగతం పలకబోతోంది. Royal Enfield Shotgun 650 పేరుతో జనవరి 15న నయా ద్విచక్ర వాహనాన్నితీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ 647.95 cc ఇంజిన్, 6 స్పీడ్ మ్యానువల్స్, 13.8 లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంక్, 46.4 bhp గరిష్ట పవర్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. దీని ధర రూ.3-3.5 లక్షల వరకూ ఉంటుందని సమాచారం.
KTM 125 Duke
ఈ నయా కేటీఎం డ్యూక్ బైక్ జనవరి 16న లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని ఆటోమెుబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బైక్ 14.7 bhp సామర్థ్యం కలిగిన 124.9 cc ఇంజిన్‌తో రానుంది. 6 స్పీడ్ మ్యానువల్స్ ఇందులో ఉండనున్నాయి. దీని ధర రూ.1,75,000 – 1,80,000 వరకూ ఉండొచ్చని అంచనా.
Hero Hurikan 440
ప్రముఖ ఆటోమెుబైల్ సంస్థ హీరో (Hero) కూడా కొత్త ఏడాదికి సరికొత్త బైక్‌తో స్వాగతం పలకబోతోంది. Hero Hurikan 440 పేరుతో శక్తివంతమైన బైక్‌ను జనవరి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 440cc ఇంజిన్‌తో ఈ బైక్ రానుంది. దీని ధర రూ.1,80,000 – 2,00,000 మధ్య ఉంటుందని సమాచారం.
Indian FTR 1200
ఈ మోస్ట్‌వాంటెడ్ బైక్ జనవరి ఆఖరిలో (31న) విడుదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. FTR 1200 బైక్ ఏకంగా 1,203 cc ఇంజిన్‌తో రానుంది. 12.9 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 125 bhp గరిష్ట పవర్ వంటి ఫీచర్లు ఈ బైక్‌లో ఉంటాయి. దీని ధర రూ.16,30,000 – 16,50,000 మధ్య ఉండొచ్చని సమాచారం. ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు లాంచింగ్ రోజున తెలియనున్నాయి.