• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vivo T3 5G: కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్‌తో వస్తోన్న వివో.. ఫీచర్లు చూస్తే షాకే!

    చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ ‘వివో’ (Vivo).. ఇటీవల ప్రీమియం మెుబైల్‌ సిరీస్‌ ‘Vivo V30’ను భారత్‌లో లాంచ్‌ చేసింది. తాజాగా మరో 5జీ మెుబైల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసేందుకు వివో సిద్ధమవుతోంది. ‘Vivo T3 5G’ పేరుతో దీన్ని తీసుకురాబోతున్నట్లు వివో అధికారికంగా వెల్లడించింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానున్నట్లు స్పష్టం చేసింది. అయితే Vivo T3 5G మెుబైల్‌కు సంబంధించిన ధర, ఫీచర్లను మాత్రం కంపెనీ ప్రకటించలేదు. అయినప్పటికీ ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    Vivo T3 5G ఫోన్‌.. 6.67 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. దీనికి  2400×1080 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్‌ రేట్‌ను అందించినట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, MediaTek Dimensity 7200 SoC ప్రొసెసర్‌పై ఫోన్‌ వర్క్‌ చేయనున్నట్లు టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ నయా వివో ఫోన్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో రానున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లో ఇది అందుబాటులో వచ్చే అవకాశముందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    బ్యాటరీ

    వివో గత మెుబైల్స్‌ లాగే Vivo T3 5G ఫోన్‌ను కూడా శక్తివంతమైన బ్యాటరీతో తీసుకురానుంది. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతు కలిగిన 5,000mAh బ్యాటరీ అమర్చినట్లు సమాచారం. USB Type-C పోర్టు సపోర్ట్‌ ద్వారా మెుబైల్‌ను వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

    కెమెరా

    Vivo T3 5G మెుబైల్‌ ట్రిపుల్‌ రియర్‌ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది. 50 MP Sony IMX882 ప్రైమరీ కెమెరా + 2 MP bokeh లెన్స్‌ + 2 MP ఫ్లిక్కర్‌ సెన్సార్‌ ఫోన్‌ వెనుక భాగంలో ఉండొచ్చని అంచనా. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం 16MP షూటర్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. వీటి సాయంతో క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. 

    కలర్ ఆప్షన్స్

    ఈ Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్‌ ఆప్షన్స్‌లో రాబోతున్నట్లు లీకైనా సమాచారం చెబుతోంది. ఈ ఫోన్‌ను కాస్మిక్ బ్లూ (Cosmic blue), క్రిస్టల్ ఫ్లేక్ (Crystal Flake) రంగుల్లో పొందవచ్చని అంటున్నారు. 

    ధర ఎంతంటే?

    Vivo T3 5G మెుబైల్‌ విడుదల తేదీ, ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్‌ ఈ నెలాఖరులోగా భారత మార్కెట్‌లో అడుగుపెట్టే అవకాశముందని టెక్‌ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ. 20,000 వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv