• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Xiaomi 14 Series: గెట్‌ రెడీ.. మోస్ట్‌ వాంటెడ్‌ మెుబైల్‌ వచ్చేస్తోంది..!

    భారత మార్కెట్‌లో టాప్ సెల్లింగ్ బ్రాండ్‌లలో రెడ్‌మీ ఒకటి. చైనీస్ కంపెనీ షావోమీ(Xiaomi) ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మొబైల్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఇటీవలే పలు మోడళ్లను రిలీజ్ చేసిన షావోమీ.. గత నెల ఫిబ్రవరి 25న మెుబైల్‌ వరల్డ్ కాంగ్రెస్‌ (MWC) 2024 ఈవెంట్‌లో Xiaomi 14 Seriesను పరిచయం చేసింది. ఇందులోని షావోమి 14 (Xiaomi 14), షావోమి 14 ప్రో (Xiaomi 14 Pro), షావోమి 14 అల్ట్రా (Xiaomi 14 Ultra) మోడల్స్‌ను రిలీజ్‌ చేసింది. మార్చి 7 నుంచి ఈ ఫోన్లు భారత్‌లోనూ లాంచ్‌ కానున్నాయి. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ షావోమి ఇండియా ఖాతా అధికారిక పోస్టును సైతం రిలీజ్‌ చేసింది.  ఈ నేపథ్యంలో ఈ మెుబైల్ ఫీచర్లు, ధర, ఇతర విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    రిలీజయ్యే మోడల్స్ ఇవే!

    గతంలో తీసుకొచ్చిన Xiaomi 13 Seriesకు అనుసంధానంగా.. షావోమి నయా సిరీస్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్‌ చేయబోతోంది. అయితే గత సిరీస్‌లో Xiaomi 13 Ultra మోడల్‌ మినహా.. Xiaomi 13, Xiaomi 13 Pro భారత్‌లో అడుగుపెట్టాయి. ఈ సారి కూడా బేసిక్‌, ప్రో మోడల్స్ మాత్రమే భారత్‌లో రిలీజవుతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో Xiaomi 14, Xiaomi 14 Pro వేరియంట్ల ఫీచర్లను ఇప్పుడు పరిశీలిద్దాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    Xiaomi 14 వేరియంట్‌ 6.36 అంగుళాల AMOLED ప్యానెల్‌తో రానుండగా.. Xiaomi 14 Pro కాస్త పెద్దగా 6.73 అంగుళాలతో భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ రెండు మోడల్స్‌ 120Hz రిఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉన్నాయి. 3,000nits బ్రైట్‌ నెస్‌, IP68 వాటర్‌ రెసిస్టెన్స్ రేటింగ్‌, Android 14 OS, Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌ పనిచేయనున్నాయి. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    Xiaomi 14 మోడల్‌ ప్రాథమికంగా 8GB RAM / 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. అటు ప్రో మోడల్‌ 12GB RAM / 256GB ROMతో వస్తుందని అంటున్నారు. మిగతా స్టోరేజ్ ఆప్షన్స్‌ కూడా ఈ మోడల్స్‌లో ఉండే అవకాశముంది. మార్చి 7న వాటిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. వర్చువల్‌గా ర్యామ్‌ను మరింత పెంచుకునే వెసులుబాటును కూడా షావోమి కల్పించింది. 

    బ్యాటరీ

    Xiaomi 14 వేరియంట్‌ 4,610mAh బ్యాటరీతో రానుంది. దీనికి  90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును అందించారు. ఇక ప్రో మోడల్‌ను 4,880mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. దీనికి ఏకంగా 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు అందించారు. రెండు మోడల్స్‌ 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌.. 10W రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు మద్దతిస్తాయి. ఈ మెుబైల్స్‌ను చాలా వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చని షావోమి వర్గాలు తెలిపాయి. బ్యాటరీ లైఫ్‌ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని పేర్కొన్నాయి.

    కెమెరా

    షావోమి 14 సిరీస్‌లో ప్రధానంగా ఆకర్షిస్తున్న ఫీచర్‌ కెమెరా. Xiaomi 14 వేరియంట్‌ 50MP + 50MP + 50MP కెమెరా సెటప్‌తో లాంచ్ అయ్యింది. దీనికి 32MP సెల్ఫీ కెమెరాను అందించారు. అటు ప్రో మోడల్‌ సైతం 50MP + 50MP + 50MP రియర్‌ కెమెరాలతో పాటు 32MP ఫ్రంట్‌ కెమెరాతో మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. అయితే ఈ సిరీస్‌లోని అల్ట్రా మోడల్‌ ఏకంగా 50MP + 50MP + 50MP + 50MP కెమెరాలతో పాటు 32MP సెల్ఫీ సెన్సార్‌తో విడుదల కావడం విశేషం. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    Xiaomi 14, Xiaomi 14 Pro వేరియంట్లు దాదాపుగా ఒకే కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటిలో Wi-Fi 802.11 a/b/g, GPS, Bluetooth v5.40, NFC, USB Type-C ఫీచర్లు ఉన్నాయి. అలాగే యాక్సిలోమీటర్‌, అంబియంట్‌ లైట్ సెన్సార్‌, బారోమీటర్‌, మ్యాగ్నోమీటర్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి. 

    కలర్స్

    Xiaomi 14 బేసిక్‌ మోడల్‌ను మూడు కలర్‌ ఆప్షన్స్‌లో పొందవచ్చు. బ్లాక్‌ (Black), వైట్‌ (White), జేడ్‌ గ్రీన్‌ (Jade Green) రంగుల్లో దక్కించుకోవచ్చు. Xiaomi 14 pro అయితే నాలుగు కలర్‌ వేరియంట్లలో భారత్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. క్లాసిక్‌ బ్లాక్‌ (Classic Black), రాక్‌ బ్లూ (Rock Blue), స్నో మౌంటెన్‌ పింక్‌ (Snow Mountain Pink), వైట్‌ (White) రంగుల్లో లభించవచ్చని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    ధర ఎంతంటే?

    భారత్‌లో Xiaomi 14 సిరీస్‌ ధరలపై మార్చి 7న అధికారిక ప్రకటన రానుంది. అలాగే ఫీచర్లపైనా ఆ రోజే మరింత స్ఫష్టత వచ్చే ఛాన్స్ ఉంది. అయితే Xiaomi 14 మోడల్‌ ప్రారంభ ధర రూ.50,000 వరకూ ఉండవచ్చని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. Xiaomi 14 Pro ధర రూ. 80,000 వరకూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఇక Xiaomi 14 Ultra వేరియంట్‌ ధర (16GB + 1TB) ఏకంగా రూ.1,01,300 వరకూ ఉంటుందని పలు టెక్‌ వెబ్‌సైట్స్‌ పేర్కొన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv