మాస్ మహారాజ రవితేజను స్టార్‌గా నిలబెట్టిన సినిమాల్లో భద్ర ముందు వరుసలో ఉంటుంది. 2005లో వచ్చిన భద్ర సినిమా ద్వారానే బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (మే 12, 2005) రిలీజైన ఈ చిత్రం ప్రభంజనమే సృష్టించింది. అప్పటికే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజను భద్ర సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ చేసింది. అలాగే దిల్‌రాజును ఇండస్ట్రీలో బలమైన నిర్మాతగా నిలదొక్కుకొనేలా చేసింది. ఈ సినిమాకు దేవిశ్రీ అందించిన పాటలు అప్పట్లో ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ ఆల్బమ్స్‌లో భద్ర సాంగ్స్ ఉన్నాయి. భద్ర సినిమా రిలీజై 18ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.
తారాగణం
భద్ర సినిమాలో రవితేజ- మీరా జాస్మిన్ జంటగా చేశారు. సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండింది. మీరా జాస్మిన్ బ్రదర్‌గా, రవితేజ ఫ్రెండ్‌గా నటుడు అర్జన్ బజ్వా నటించాడు. అలాగే ప్రకాష్ రాజ్, మురళి మోహన్, ప్రదీప్ రావత్, బ్రహ్మాజీ, సునీల్ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకు ఆర్తూర్ A. విల్సన్ సినిమాటోగ్రఫీ అందించగా మాటలు కొరటాల శివ అందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు రాశారు.
గ్రాండ్ ఎంట్రీ
దర్శకుడిగా బోయపాటి శ్రీను సత్తా ఏంటో భద్ర సినిమా చూపించింది. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బోయపాటిని దగ్గర చేసింది. భద్ర తర్వాత బోయపాటి శ్రీను స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. అతని డైరెక్షన్ స్కిల్స్ చూసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్లు బోయపాటితో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరిచారు.
కాసుల వర్షం
దిల్, ఆర్య సినిమా హిట్లతో ఊపు మీదున్న నిర్మాత దిల్ రాజుకు భద్ర సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో దిల్ రాజు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. బడ్జెట్ కంటే రెట్టింపు వసూళ్లను భద్ర రాబట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
నో రెమ్యూనరేషన్!
భద్ర సినిమా కోసం బోయపాటి శ్రీనుకు దిల్‌రాజు రూ. 6 లక్షలతో పాటు ఓ కారు కూడా ఆఫర్ చేశారట. అయితే తన ఫస్ట్ సినిమాకు బడ్జెట్ సమస్య రాకుండా తన రెమ్యూనరేషన్ కూడా చిత్ర నిర్మాణానికి వినియోగించాలని బోయపాటి సూచించారట.
ఛాన్స్ మిస్ చేసుకున్న బన్నీ
భద్ర సినిమాకు రవితేజకు బదులు మెుదట అల్లు అర్జున్‌ను అనుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల బన్నీ చేయలేకపోయారట. రవితేజను సంప్రదించగానే ఆయన ఓకే చెప్పేశారట.
స్టోరీనే బలం
భద్ర సక్సెస్‌లో ఆ సినిమా స్టోరీదే కీ రోల్. అప్పటివరకూ చూసిన సినిమా కథలతో పోలిస్తే భద్ర స్టోరీలైన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా కోణాలను స్పృశిస్తూ సినిమా సాగింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!