గ్లామరస్ డాల్ ఇలియానా నేడు 38 వ వంసంతంలోకి అడుగుపెట్టింది. తెలుగువారికి ఇలియానా అంటే పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. సినిమాల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.1986 నవంబర్ 1న జన్మించిన ఇలియానా నేడు 38వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గోవా బ్యూటీ ఇలియానా 2006లో వైవీఎస్ చౌదరి డైరెక్షన్‌లో వచ్చిన దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో రామ్ పొత్తినేని పక్కన హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమాలో ఇలియానా ఒంపు సొంపులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అందాల తెగింపు హిందీలోనూ హిట్ చిత్రాల్లో నటించింది. 2012లో బర్ఫీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
‘బాద్షాహో’, ‘రుస్తోమ్’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో మెరిసింది. చక్కని శరీర సౌష్ఠవంతో ప్రదర్శించే అందాలతో హాట్ హీరోయిన్‌గా మారిపోయింది.
ఇలియానా యాక్టింగ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ (HBD IlleanIleana D’Cruz)
ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ బోల్డ్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
2018లో మెకాఫీ ‘మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ’ సర్వేలో ఇలియానా టాప్‌లో నిలిచింది. ఈక్రమంలో దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, కృతి సనన్, పరిణీతి చోప్రా వంటి స్టార్లను వెనక్కి నెట్టింది
10 ఏళ్ల వయసులోనే ఇలియానా నటన ప్రారంభించింది. ఇండస్ట్రీకి రాకముందే మోడలింగ్ చేసేది.
ఇలియానాకు డిజైనర్ రింగ్‌లను సేకరించడమంటే హాబీ. ఇప్పటి వరకు ఆమె దగ్గర 400 కంటే ఎక్కువ డిజైనర్ రింగ్‌లు ఉన్నాయి.
డేటింగ్ హిస్టరీ
ఇలియానా సినీ కెరీర్ హిట్ అయినంతగా… పర్సనల్ లైఫ్ మాత్రం కాలేదు. తొలుత ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. వీళ్లిద్దరు చాలా ఏళ్లు సహజీవనం చేశారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు 2019లో విడిపోయారు.
ఆండ్రూ నీబోన్‌తు విడిపోయిన తర్వాత.. ఇలియానా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖెల్‌తో జతకట్టింది. వీరిద్దరు 2023 వరకు సహజీవనం చేశారు.
సెబాస్టియన్‌తోనూ పొసగక ఇలియానా అతనికి ఈ గోవా సుందరి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత వెంటనే 2023 జులైలో మైకెల్ డోలాన్‌తో తన రిలేషన్ షిప్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది.
తామిద్దరం డేట్ నైట్ చేస్తున్నట్లు ఇన్‌స్టాలో(HBD IlleanIleana D’Cruz) హార్ట్ ఎమోజీతో తమ రిలేషనన్ షిప్‌ను కన్ఫామ్ చేసింది. ఆ తర్వాత పెళ్లి (మే 13.2023) ద్వారా ఈ ఇద్దరు ఏకం అయ్యారు.
అయితే ఇలియానా పెళ్లికి ముందే తన ప్రెగ్నెన్సీని ఏప్రిల్ కన్ఫామ్ చేసింది. అయితే తన బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.
2023 ఆగస్టు 1న ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
మరోవైపు ‘ఫాటా పోస్టర్ నిక్లా’ హీరో సినిమా చిత్రీకరణ సమయంలో.. హీరో షాహిద్ కపూర్‌తో ఎఫైర్ కొనసాగించినట్లు గాసిప్స్ ఉన్నాయి.
వివాదాలు
సెక్స్‌పై ఇలియానా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.
“sex is a major relaxation to my body. it keeps me Young and I dont mind to talk about that in Public”
(“సెక్స్ నా శరీరానికి ముఖ్యమైన విశ్రాంతి. ఇది నా యవ్వనాన్ని కాపాడుతుంది, ఈ విషయాన్ని ప్రజల ముందు మాట్లాడటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.”)
ఇలియానాకు హైదరాబాదీ బిర్యాని అంటే చాలా ఇష్టం, చైనీస్, ఇటాలియన్ ఫుడ్ వెరైటీస్‌ను కూడా ఇష్టంగా తింటుంది.
బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలిఖాన్‌లు తన అభిమాన నటులు అని పలు సందర్భాల్లో చెప్పింది.
ఇలియానా దక్షిణాదిలో కోటీ రూపాయలు రెమ్యునరేషన్‌గా పొందిన తొలి హీరోయిన్‌గా పేరు గడించింది.
ఆమె కెరీక్ పీక్‌లో ఉన్నప్పుడు ఒక్కొ సినిమాకు రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేసింది.
ఇలియానాకు మద్యం అలవాటు ఉంది. పార్టీ సమయాల్లో రెగ్యులర్‌గా మద్యం సేవిస్తూ ఉంటుంది.
ఇలియానాకు హిందీ భాష పూర్తిగా రాదు, గోవాలో పుట్టి పెరగడంతో ఆ భాషపై అంతగా పట్టు సాధించలేదు. క్రమంగా బర్పీ చిత్రం నుంచి హిందీపై పట్టు సాధించింది.
ఇలియానాకు మింట్ చాక్లెట్స్ అంటే తెగ ఇష్టం. వాటికి తాను అడిక్టెడ్. ఎప్పుడూ నములుతూనే ఉంటుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం