అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’ కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. పుష్ప ది రైజ్‌లో ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సమంత చేసిన ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకి థియేటర్లు మార్మోగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా (Pushpa 2 Item Song)ఈ సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు పార్ట్ 2లో ఐటెం సాంగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే పుష్ప 2లో రానున్న ఐటెం సాంగ్‌లో ఎవరు నటిస్తారన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.
తొలుత యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘పుష్ప 2’ ఐటెం సాంగ్ చేస్తుందని అంతా భావిస్తుండగా చిత్ర యూనిట్ ఆమెకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. తృప్తి దిమ్రి చేత రిహార్సల్స్ చేయించగా వచ్చిన అవుట్‌పుట్ పట్ల మేకర్స్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో ఆమెను పక్కకు పెట్టారని టాక్ నడుస్తోంది. ఆమె స్థానంలో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు యువ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
‘పుష్ప’ మూవీపై దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.1000 కోట్లు దాటింది. దీంతో మేకర్స్ ప్రతి అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్ట్ 1 కన్న ఘనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్ట్ 1 ఫీల్ ఏమాత్రం తగ్గినా పుష్ప 2 విజయం సాధించదు అనే భావనలో జాగ్రత్త వహిస్తున్నారు. ముఖ్యంగా పుష్పలో పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.
ఐటెం సాంగ్‌లో శ్రీలీల
పుష్ప 2లో ఐటెం సాంగ్‌లో బన్నీ సరసన నర్తించేందుకు చిత్ర బృందం శ్రీలీలను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌పై యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. గుంటూరుకారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన ఐటెం సాంగ్ ఎంత ప్రజాదారణ పొందిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో “ఆ కుర్చి మడతపెట్టి” సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసింది. అందాల ప్రదర్శనతో పాటు (Pushpa 2 Item Song)డ్యాన్స్‌తోనూ అదరగొట్టింది. మహేష్‌తో పోటీపడి మరి స్టెప్పులేసింది. లుక్స్, గ్లామర్ షో పరంగా ఆకట్టుకుంది. దీంతో శ్రీలీలను ఐటెం సాంగ్‌లో తీసుకోవాలనే ప్రయత్నాలను మూవీ మేకర్స్ ముమ్మరం చేశారు. ఇందుకు సుకుమార్, బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఈ ఇద్దరి కలయిక ఎలా ఉంటోందో అని ప్రేక్షకులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన బన్నీ, ఈ కుర్ర హీరోయిన్‌తో స్టెప్పులు ఇరగదీయనున్నాడు.
బన్నీతో శ్రద్ధా కపూర్ రొమాన్స్
పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం వినిపిస్తున్న మరో పేరు బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్. రీసెంట్‌గా ఆమె నటించిన స్త్రీ-2 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె గ్లామర్ షోక్ యూత్ ఫిదా అయిపోయింది. దీంతో శ్రద్ధా కపూర్ పేరును కూడా (Pushpa 2 Item Song)ఐటెం సాంగ్ కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెతో మూవీ యూనిట్ మాట్లాడినట్లు సమాచారం. ఒక వేళ శ్రద్ధా కపూర్ ఒకే చెబితే.. పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప బజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే పుష్ప2 ఐటెం సాంగ్‌లో ఎవరు నటిస్తారనేదానిపై గత వారం ఆ చిత్ర నిర్మాత ఓ ప్రకటన చేశారు. నవంబర్‌లో ఐటెం సాంగ్ షూట్ ఉంటుందని అప్పుడే అల్లు అర్జున్ సరసన నర్తించే హీరోయిన్ పేరు వెల్లడిస్తామని తెలిపారు. సో, త్వరలోనే ఆ వ్యక్తి పేరు అధికారికంగా బయటకు రానుంది.
బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్లు
‘పుష్ప 2’లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులోని ఐటెం సాంగ్‌లో రష్మిక మంధాన కూడా స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. ఐటెం గార్ల్‌తో పాటు రష్మిక కూడా ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపనుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్ట్ 1లో రష్మిక ఉన్నప్పటికీ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించలేదు. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ బన్నీ- సమంత ఇద్దరే స్టెప్పులు ఇరగదీశారు. ఈసారి రష్మికతో కలిసి ఇద్దరు భామలు ఐటెం సాంగ్‌లో కనిపించనుండటంతో మూవీ లవర్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఇద్దరి భామాలతో కలిసి బన్నీ ఏ స్థాయిలో అలరిస్తాడో మరి చూడాలి.
నవంబర్‌లో పుష్ప మేనియా
నవంబర్ నెలను పుష్ప నెల అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించారు. మూవీ విడుదలకు మరో నెల మాత్రమే మిగిలి ఉండటంతో ప్రమోషన్లు షూరు చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. నవంబర్‌లో దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు హింట్ ఇచ్చారు. అన్ని భాషల్లో ప్రచారాన్ని త్వరలో మొదలపెట్టనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 15 నుంచి ఈ ప్రక్రియ మొదలు కానున్నట్లు టాక్. ఈ ప్రమోషన్లలో అల్లు అర్జున్‌తో పాటు మూవీ యూనిట్ పాల్గొననుంది.
చివరి దశకు ‘పుష్ప 2’ షూటింగ్
‘పుష్ప 2’ చిత్రానికి సంబంధించి షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఒక్క ఐటెం సాంగ్ మినహా మొత్తం వర్క్ ఫినిష్ చేశారని సమాచారు. గత నెలలో రామోజీ ఫిల్మ్ సిటీలో హీరో అల్లు అర్జున్, విలన్ ఫహాద్ పాజిల్‌పై క్లైమాక్స్ సన్నివేశాలను సుకుమార్ తెరకెక్కించారు. ఫహాద్ ఫాజిల్, అల్లు అర్జున్‌ల నటన, సంభాషణలతో పాటు యాక్షన్ సన్నివేశాలు ఈ క్లైమాక్స్‌లో కీలకంగా ఉండబోతున్నాయని టాక్. తొలి పార్ట్‌లో తరహాలోనే ‘పుష్ప 2’లోనూ క్లైమాక్స్ కీలకంగా మారుతుందని పేర్కొంటున్నారు. పైగా మూడో పార్ట్‌కు సంబంధించిన లింక్‌ను కూడా ఈ క్లైమాక్స్‌లో షూట్ చేసారని సమాచారం.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ