దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘లక్కీభాస్కర్’ (Lucky Bhaskar), ‘క’ (KA), ‘అమరన్’ (Amaran) చిత్రాలు మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సైతం సాధిస్తున్నాయి. తొలి రోజు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూడు చిత్రాలు వీకెండ్‌కు వచ్చే సరికి తమ వసూళ్లను గణనీయంగా పెంచుకున్నాయి. తొలి నాలుగు రోజుల్లో ఏ మూవీ, ఎంత వసూలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్కీ భాస్కర్ (Lucky Bhaskar Weekend Collections)
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీపావళి కానుకగా గురువారం (అక్టోబర్ 31) రిలీజైన ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.55.4 కోట్ల (GROSS) కలెక్షన్స్‌ను ‘లక్కీ భాస్కర్’ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు హీరో, దర్శకుడితో పాటు నిర్మాత నాగవంశీ ఉన్న స్పెషల్ పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ట్రేడ్ వర్గాల విశ్లేషణల ప్రకారం ఒక్క ఏపీ, తెలంగాణల్లోనే ఈ చిత్రం రూ.19.10 కోట్లు (GROSS) రాబట్టింది. కేరళలో రూ.8.75 కోట్లు, కర్ణాటకలో రూ. 2.65 కోట్లు, తమిళనాడులో రూ. 3.40 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.95 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.13.40 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి.
క (KA Weekend Collections)
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ ‘క’ (KA Movie). అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. గురువారం ఈ మూవీ రిలీజవ్వగా శని, ఆదివారాల్లో కలెక్షన్స్ మరింత పెరిగినట్లు సమాచారం. తొలి నాలుగు రోజుల్లో రూ.26.52 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. అటు తొలి మూడు రోజుల్లోనే ‘క’ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించినట్లు ఫిల్మ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై వచ్చేవన్ని లాభాలే అంటూ తెలిపాయి. అంతేకాదు రోజురోజుకు ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేసింది.
అమరన్
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సాయిపల్లవి (Sai Pallavi) కాంబోలో తెరకెక్కిన ‘అమరన్’ (Amaran Movie) పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతోంది. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చితక్కొడుతోంది. తొలి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.136 కోట్ల (GROSS) వసూళ్లు సాధించినట్లు ట్రెడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ. 65.05 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.15.45 కోట్లు, కర్ణాటకలో రూ.8.05 కోట్లు, కేరళలో రూ.4.45 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి. అటు ఓవర్సీస్‌లో ఏకంగా రూ.41.85 రాబట్టినట్లు స్పష్టం చేశాయి. రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీపావళికి రిలీజైన చిత్రాల్లో ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక చిత్రంగా ‘అమరన్’ నిలిచింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!