దీపావళి సందర్భంగా ‘క’, ‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’ వంటి ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ వారం కూడా అదే తరహాలో ఎంటర్టైన్ చేసేందుకు పలు సినిమాలు రెడీ అయ్యాయి. అయితే ఈసారి చిన్న చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర మూవీస్, వెబ్‌సిరీస్ రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo)
యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo). నిఖిల్‌తో ‘స్వామిరారా’, ‘కేశవ’ తీసిన దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమా రూపొందించారు. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. రుక్మిణీ వసంత్ కథానాయిక. దివ్యాంశ కౌశిక్ కీలక పాత్ర పోషించింది. నవంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
ధూం ధాం (Dhoom Dhaam)
చేతన్ కృష్ణ (Chethan Krishna), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జితేందర్‌రెడ్డి (Jithender Reddy)
రాకేశ్ వర్రే కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ దర్శకుడు విరించి వర్మ ఈ సినిమాను రూపొందించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8నప్రేక్షకుల ముందుకు రానుంది.
బ్లడీ బెగ్గర్ (Bledy Beggar)
ఈ వారం ఓ తమిళ డబ్బింగ్ ఫిల్మ్ కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఇటీవల దీపావళికి విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ‘బ్లడీ బెగ్గర్’ (Bledy Beggar) చిత్రాన్ని నవంబర్ 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కవిన్ లీడ్ రోల్లో చేసిన ఈ చిత్రానికి శివ బాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించారు. నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మించారు.
జాతర (Jathara)
సతీష్‌బాబు రాటకొండ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాతర’ (Jathara). రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాతలు. నవంబర్ 8న ఈ మూవీ బాక్సాఫీస్ ముందుకు రానుంది. చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా చిత్రంగా దీనిని రూపొందించినట్లు మేకర్స్ తెలియజేశారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
దేవర (Devara)
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ సుమారు 40 రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం (నవంబర్ 8) నుంచి స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం.
వేట్టయన్ (Vettaiyan)
రజనీకాంత్ (Rajinikanth), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటించిన తమిళ హిట్ మూవీ వేట్టయన్ కూడా ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 8) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ సినిమాలో రజనీ, అమితాబ్‌తోపాటు రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక పాత్రలు చేశారు.
ఏఆర్ఎం (ARM)
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏఆర్ఎం’ (ARM). ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ మూవీ నవంబర్ 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
సిటడెల్: హనీ బన్నీ (Citadel: Honey Bunny)
సమంత (Samantha), వరుణ్ ధావన్ (Varun Dhawan) నటించిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ‘. ఈ సిరీస్ ఈ వారమే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అమెజాన్ వేదికగా నవంబర్ 7 నుంచి స్టీమింగ్ కాబోతోంది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ వెబ్‌సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై అంచనాలను అమాంతం పెంచేసింది.
Title | Category | Language | Platform | Release Date |
Meet Me Next Christmas | Movie | English | Netflix | Nov 6 |
Outer Banks 4 | Series | English | Netflix | Nov 7 |
Mr. Plankton | Movie | English/ Korean | Netflix | Nov 8 |
The Buckingham Murders | Movie | Hindi | Netflix | Nov 8 |
Vijay 69 | Movie | Hindi | Netflix | Nov 8 |
Its end with us | Movie | English | Netflix | Nov 9 |
Countdown: Paul vs. Tyson | Series | Telugu Dub | Amazon | Nov 1 |
Investigation Allien | Series | English | Amazon | Nov 8 |
Despicable Me 4 | Movie | Telugu | Jio Cinema | Nov 5 |
Explorer: Endurance | Movie | English | Hotstar | Nov 3 |
Janaka Ithe Ganaka | Movie | Telugu | Aha | Nov 8 |
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్ సర్కార్ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?