ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ నాగవంశీ. తాజాగా ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని జరిగిన సక్సెస్ మీట్‌లో నాగవంశీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో తమ బ్యానర్‌పై రాబోయే చిత్రాల గురించి మాట్లాడారు.
నాగవంశీ చెప్పిన వివరాల ప్రకారం, 2018లో ఒక డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు తమకు మంచి విజయాలను అందించాయి. ఈ సక్సెస్ తరువాత త్రివిక్రమ్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నాగవంశీ వెల్లడించారు. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాగా ఉండబోతుందని, ఈ చిత్రం 2029 ఎన్నికలకు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్‌తో నేరుగా త్రివిక్రమ్ చేసిన లాస్ట్ చిత్రం అజ్ఞాతవాసి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన బీమ్లా నాయక్, బ్రో వంటి చిత్రాలు త్రివిక్రమ్ మార్గదర్శనంలో సాగాయి. దీంతో వీరి కలయికలో సాలిడ్ హిట్ కోసం ప్రేక్షకులైతే ఎదురు చూస్తున్నారు.
కథా నేపథ్యం
నాగవంశీ స్పీచ్ తర్వాత.. త్రివిక్రమ్ తీయబోయే పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పవన్ కళ్యాణ్ ఏవిధంగా చూపించబోతున్నాడు. ఆయన ఎలాంటి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు అనే ఆసక్తి పెరిగింది. 2014 నుంచి పవన్ కళ్యాణ్ ప్రస్థానం, జనసేన పార్టీ ఆవిర్భవానికి గల కారణాలు వంటివి సినిమాలో ఉండే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఎపిసోడ్, జగన్ ప్రభుత్వ పాలన లోపాలు వంటివి చూపించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం ప్రధానంగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పెట్టుకున్న పొత్తు, చంద్రబాబు జైలు ఎపిసోడ్, వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు సినిమాలో ప్రధాన భాగం కావొచ్చు.
ఇప్పటి వరకు ఫ్యామిలీ, రొమాన్స్, కామెడీ జనర్లకే పరిమితమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు.. పొలిటికల్ థ్రిల్లర్‌కు మారడం సర్వత్రా ఉత్కంట నెలకొంది. అయితే ఆయన తీయబోయే పొలిటికల్ థ్రిల్లర్‌లో ఎవరెవరు నటిస్తున్నారు అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నందున, ఈ కథకు ఆయన అనుకూలమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
షూటింగ్‌ల్లో పవన్ బిజీ బిజీ
ప్రస్తుతం పవన్ కల్యాణ్ తన పెండింగ్ ప్రాజెక్ట్స్‌లలో ఒకటైన ‘ఓజీ’ (OG Movie) షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ ‘ఓజీ’ షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభం అయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఓజీని వచ్చే ఏడాది అక్టోబర్ 25న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇందుకోసం విజయవాడలో మేకర్స్ భారీ సెట్‌ను సైతం వేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ మూవీని తొలుత పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీని సైతం హరిహర వీరమల్లు టీమ్ ఫిక్స్ చేసింది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం