తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుందనే చెప్పాలి. సినిమాకు మార్కెట్ పెరగటంతో పాటు ప్రేక్షకులు కూడా అదేస్థాయిలో ఆదరిస్తున్న కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. టాలీవుడ్లో ఈ జాబితాలో సుమారు 40 సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు 100 కోట్ల క్లబ్లో టాప్‌లో ఉన్నాడు.రూ.100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు, హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం.
హీరో -సినిమాలు
హీరో | సినిమాలు |
మహేశ్‌బాబు | 6 |
అల్లు అర్జున్ | 5 |
ప్రభాస్ | 4 |
ఎన్టీఆర్ | 4 |
చిరంజీవి | 3 |
రామ్ చరణ్ | 3 |
పవన్ కల్యాణ్ | 3 |
బాలకృష్ణ | 2 |
మహేశ్ బాబు
100 కోట్లకు పైన కలెక్ట్ చేయాలంటే మహేశ్ బాబుకు సాధ్యం. ఎందుకంటే ఆయన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సులభంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేశ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
సినిమా | కలెక్షన్ |
సరిలేరు నీకెవ్వరు | 237 కోట్లు |
సర్కారు వారి పాట | 192 కోట్లు |
మహర్షి | 184 కోట్లు |
భరత్ అనే నేను | 178 కోట్లు |
శ్రీమంతుడు | 153 కోట్లు |
దూకుడు | 101 కోట్లు |
ప్రభాస్
ఎక్కువ సినిమాలు మహేశ్‌కు ఉండొచ్చు గానీ ఎక్కువ కలెక్షన్లు మాత్రం ప్రభాస్‌వే. బాహుబలి లాంటి సినిమాలను కొట్టే సినిమా రావాలంటే అది మళ్లీ ప్రభాస్ నుంచే రావాలి.
సినిమా | కలెక్షన్ |
బాహుబలి-2 | 1749 కోట్లు |
బాహుబలి-1 | 600 కోట్లు |
సాహో | 417 కోట్లు |
రాధేశ్యామ్ | 151 కోట్లు |
చిరంజీవి
ఈతరం హీరోలతో పోటీ పడుతూ రూ.100 కోట్ల క్లబ్లో దూసుకుపోవడం కేవలం మెగాస్టార్‌కే చెల్లింది. యంగ్ హీరోలను దాటి 3 సినిమాలు 100 కోట్లు వసూలు చేయడం బాస్ క్రేజ్‌కు నిదర్శనం
సినిమా | కలెక్షన్ |
సైరా నరసింహా రెడ్డి | 248 కోట్లు |
వాల్తేరు వీరయ్య | 200 కోట్లు |
ఖైదీ నం.150 | 166 కోట్లు |
అల్లు అర్జున్
పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఆ సినిమా కంటే ముందే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. రాబోయే రోజుల్లో ఈ లిస్ట్‌లో బాస్‌గా ఎదిగేందుకు అల్లు అర్జున్‌కు చక్కటి అవకాశముంది.
సినిమా | కలెక్షన్ |
పుష్ప-ది రైజ్ | 369 కోట్లు |
అల వైకుంఠపురములో | 274 కోట్లు |
సరైనోడు | 120 కోట్లు |
డీజే | 115 కోట్లు |
రేసు గుర్రం | 102 కోట్లు |
రామ్ చరణ్
RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్‌చరణ్, అంతకు ముందే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్‌కు వచ్చిన క్రేజ్‌కు ఈ లిస్ట్‌లో తన సినిమాలు పెరుగుతాయడనడంలో సందేహం లేదు.
సినిమా | కలెక్షన్ |
RRR | 1131కోట్లు |
రంగస్థలం | 213 కోట్లు |
మగధీర | 125 కోట్లు |
జూ. ఎన్టీఆర్
RRRతో రామ్ చరణ్‌కు ఎంత పేరొచ్చిందో అంతకు 10 రెట్లు ఎక్కువే పేరు సంపాదించాడు తారక్. తనకున్న వాక్ చాతుర్యంతో మరింత ఎక్కువ ఫ్యాన్‌బేస్ సొంతం చేసుకున్నాడు. 100 కోట్ల క్లబ్లో తారక్ కూడా మరింత దూసుకెళ్లబోతున్నాడు.
సినిమా | కలెక్షన్ |
RRR | 1131కోట్లు |
అరవింద సమేత | 155 కోట్లు |
జై లవకుశ | 145 కోట్లు |
జనతా గ్యారేజ్ | 126 కోట్లు |
పవన్ కల్యాణ్
టాలివుడ్లో అరాచక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్‌కు ఈ క్లబ్లో 3 సినిమాలు ఉన్నాయి. అయితే పవర్ స్టార్ ప్రస్తుత సినిమా లైనప్ చూస్తుంటే తప్పకుండా కుర్ర హీరోలను దాటి ముందుకెళ్లే అవకాశముంది.
సినిమా | కలెక్షన్ |
భీమ్లా నాయక్ | 161 కోట్లు |
వకీల్ సాబ్ | 138 కోట్లు |
అత్తారింటికి దారేది | 131 కోట్లు |
బాలకృష్ణ
అఖండ సినిమాతో బాలయ్య ప్రభంజనం సృష్టించాడు. ఆ సినిమా రూ. 100 కోట్ల క్లబ్లో చేరగా.. ఇటీవల విడుదలైన వీరసింహా రెడ్డి కూడా అదే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK 108 కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నారు.
సినిమా | కలెక్షన్ |
అఖండ | 133 కోట్లు |
వీరసింహా రెడ్డి | 109 కోట్లు |
మరికొన్ని సినిమాలు
వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన F2 రూ.100కోట్లు వసూలు చేసింది. కుటుంబ కథా చిత్రం కావటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. రౌడీ విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం, రవితేజ ధమాకా, నాని దసరా చిత్రాలు ఈ క్లబ్లో ఉన్నాయి.
సినిమా | హీరో | కలెక్షన్ |
F2 | వెంకటేశ్-వరుణ్ తేజ్ | 143 కోట్లు |
గీత గోవిందం | విజయ్ దేవరకొండ | 130 కోట్లు |
దసరా | నాని | 110 కోట్లు |
ధమాకా | రవితేజ | 108 కోట్లు |
పాత రోజుల్లో సినిమా హిట్ లెక్కలు రోజుల్లో చూసేవారు. సిల్వర్ జుబ్లీ, గోల్డెన్ జుబ్లీ, 100 డేస్ ఫంక్షన్లు చేసేవారు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా పక్కా కమర్షియల్ అయిపోయింది. హిట్ లెక్కలు కలెక్షన్లతోనే నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇక 100 కోట్ల క్లబ్ గురించి మాట్లాడటం మానేసి రూ.1000 కోట్ల క్లబ్ గురించి మాట్లాడుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!