• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Largest Hindu Temples: ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాలు.. వీటిని చూడాలంటే రెండు కళ్లు సరిపోవు..!

    ప్రపంచంలోని అతి ప్రాచీన మతాల్లో హిందూ మతం ఒకటి. హిందూ మతంలో దేవాలయాలను పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే శతాబ్దాల కాలంగా ఎంతో మంది రాజులు పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మించి వాటిని పోషించారు. మన సంస్కృతికి, శిల్ప కళా వైభవానికి ప్రతీకలుగా నిలిపారు. కేవలం భారత్‌లోనే గాక విదేశాలలోనూ ఆలయాలను నిర్మించి భారతీయ సంస్కృతిని విశ్వ వ్యాపితం చేశారు. ఇలాంటి ఖ్యాతిని కలిగిన ఆలయాలు ప్రపంచం నలుమూలలు ఉండగా.. కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. వేల సంవత్సరాలుగా ఆ దేవాలయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాలుగా కీర్తి గడుస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    పశుపతినాథ్ ఆలయం (నేపాల్‌)

    ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా నేపాల్‌లోని పశుపతినాథ్‌ క్షేత్రం గుర్తింపు పొందింది. ఈ గుడి దాదాపు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఖాట్మండులోని ఈ పురాతన ఆలయాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి శైవ భక్తులు వెళ్తుంటారు. ఇక్కడి శివలింగం అయిదు ముఖాలను కలిగి వుంటుంది. రెండు అంతస్తులు కలిగిన ఈ ఆలయం.. బంగారపు పైకప్పుతో వెండి ద్వారాలతో దర్శనమిస్తుంది. ప్రదక్షిణ మార్గంలో వందలాది శివలింగాలు కొలువుదీరి కనిపిస్తుంటాయి. 

    అంగ్కోర్‌ వాట్‌ (కంబోడియా) 

    ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేవాలయంగా అంగ్కోర్‌ వాట్‌ క్షేత్రం ఉంది. ఇది సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరాన్ని కలిగి ఉంది. ఎన్నో వింతలు, అద్భుతమైన విశేషాలకు నిలయం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి కాపాడుతోంది. వెయ్యి శతాబ్దానికి చెందిన ఖ్మేర్ రాజవంశ రాజు సూర్యవర్మన్-2 ఈ ఆలయాన్ని నిర్మించారు.

    శ్రీరంగనాథ స్వామి ఆలయం (తమిళనాడు)

    తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆలయంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం దాదాపు 156 ఎకరాల్లో విస్తరించి ఉంది. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీరంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. 

    అక్షర్‌ధామ్‌ (ఢిల్లీ)

    ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయం ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద దేవాలయం. ఈ ఆలయ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఆలయ ప్రాంగణంలో సుమారు 200మంది ప్రముఖ రుషుల రాతి శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం మెుత్తాన్ని ఎర్రటి ఇసుకరాయితో నిర్మించారు. 141 అడుగుల ఎత్తులో నిర్మించిన అక్షర్‌ధామ్‌ ఆలయం పురాతన నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. 

    బెలూర్‌ మఠం (బెంగాల్‌)

    బంగాల్‌ రాజధాని కోల్‌కత్తాలో ఈ బెలూర్‌ మఠం ఉంది. స్వామి వివేకానంద 1899 ఈ మఠాన్ని నిర్మించారు. దేశ వ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మిషన్‌లకు ఈ మఠం కేంద్ర కార్యాలయంగా పనిచేస్తోంది. దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. పాశ్చాత్య శైలులతో మిళితమైన శిల్పకళా నైపుణ్యాన్ని ఈ మఠం ప్రతిబింబిస్తుంది. ఇక్కడి నాలుగు చిన్న గోపురాలు నాలుగు వేదాలకు అద్దం పడతాయి. 

    నటరాజు ఆలయం (తమిళనాడు)

    తమిళనాడులోని చిదంబరం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది నటరాజ ఆలయం. ఈ ఆలయాన్ని 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ దేవాలయంలో మహా శివుడు నటరాజ స్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఈ దేవాలయం గోపురం పైన 21,600 బంగారం రేకులతో తాపడం చేశారు. ఈ దేవాలయానికి ఏకంగా 9 ప్రవేశ ద్వారాలు ఉండటం విశేషం

    ప్రంబనన్‌ ఆలయం (ఇండోనేషియా)

    ఇండోనేషియాలోనే అతిపెద్ద ఆలయంగా ప్రంబనన్‌ క్షేత్రం గుర్తింపు పొందింది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. 8వ శతాబ్దానికి చెందిన  ‘సంజయ’ రాజవంశానికి చెందిన రకై పికటన్‌ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గోపురాలు, విగ్రహాలు, ఆలయ గోడలు, స్తంభాలు అద్భుతమైన శిల్పచాతుర్యం కొలమానాలుగా అనిపిస్తాయి. రామాయణ, భాగవతాలలోని ఘట్టాలు ఆలయంలో కుడ్యచిత్రాలుగా దర్శనమిస్తాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv