• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Independence Day 2023 Makeover: జెండా వందనానికి ఎలా రెడీ కావాలని ఆలోచిస్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే మీకు తిరుగులేదు..!

    ఇండిపెండెన్స్ డే(Independence Day 2023) వచ్చేస్తోంది. ఈ సందర్భంగా అణువణువునా దేశభక్తి పరిమళిస్తుంటుంది. ఒక్కొకరు ఒక్కో విధంగా దేశంపై ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. కొందరు సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. మూడు రంగుల జెండాని పోలిన దుస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. మరికొందరు ముఖం, చెంపలపై తిరంగా పెయింట్‌ని వేసుకుంటారు. అయితే, మనలో చాలా మందికి ఈ ఆలోచన ఉన్నా దాన్ని ఎలా అమలు పరచాలనే సందేహం వెంటాడుతుంది. డ్రెస్ కోడ్‌ని పాటిస్తూ సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవడంలో తర్జన భర్జన పడుతుంటాం. ఈ క్రమంలో ‘ఇండిపెండెన్స్ డే’ని ఉత్సాహంగా జరుపుకోవడానికి మేక్ ఓవర్ విషయంలో పాటించాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం.

    కొత్తగా ఆలోచించండి..

    అందరూ తిరంగా రంగులను పోలి ఉండేలా డ్రెస్సులను వేసుకోవాలని చూస్తారు. అయితే, అందులోని అశోక చక్రంపై ఫోకస్ పెట్టరు. నీలి రంగులో ఉండే అశోక చక్రం తిరంగాలో భాగమే. అంటే, కాషాయం, శ్వేత, హరిత వర్ణాలే కాకుండా బ్లూ కలర్‌ వస్త్రాలను కూడా ఎంచుకోవచ్చు. వీటితో ఏ రకమైన డ్రెస్ సెటప్ చేసుకోవచ్చో ఆలోచించొచ్చు. దుస్తులపై ఈ అశోక చక్రాన్ని ప్రింటింగ్ చేయించుకోవచ్చు. బ్లూ, వైట్ కాంబోలో ఉండే అటైర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి రెండు కలిస్తే చార్మింగ్‌గా ఉంటుంది. ఇండిపెండెన్స్ డేని ప్రతిబింబించనట్లు అవుతుంది.  

    సమీప రంగులు

    జెండాలో ఉండే రంగులనే తీసుకోవాలనే నిబంధనను వీడండి. వీటికి సమీప రంగులను కూడా ఎంచుకోవచ్చు. డ్రెస్ కోడ్‌ని బట్టి ఒక్కో రిలవెంట్ కలర్‌ని ఎంపిక చేసుకోండి. కాషాయ, శ్వేత, హరిత వర్ణాలకు దగ్గరగా ఉండే పేస్టల్ వేరియంట్స్‌కి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ఇవి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. మీ భావాలను వ్యక్త పరుస్తాయి. సల్వార్, సారీల్లో ఈ రంగులతో అద్భుతం చేయొచ్చు.   

    ఖాదీ వస్త్రాలు..

    భారత స్వాతంత్య్రోద్యమంలో స్వదేశీ ఉద్యమానిది కీలక పాత్ర. దేశంలో తయారైన వస్త్రాలనే ధరించాలనే నినాదం ఉద్యమ సమయంలో మారుమోగింది. కాబట్టి, ఖాదీ వస్త్రాలు ధరించే ప్రయత్నం చేయండి. ఇవి చాలా సౌకర్యవంతంగా, తేలికగా ఉంటాయి. చికాకు కలిగించవు. దేశభక్తిని కూడా చాటినట్లు ఉంటుంది. మీ వస్త్రధారణతో గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిద్దామనే సందేశాన్ని ఇవ్వండి.  

    ఎలిమెంట్స్

    దుస్తులతోనే కాకుండా మిగతా ఆభరణాలతోనూ దేశభక్తిని చాటొచ్చు. జెండా రంగులను కలిగి ఉండే వాటిని ధరించే ప్రయత్నం చేయండి. చెవులకు అశోక చక్రాన్ని చూపే రింగ్‌లను(ఇయర్ రింగ్స్) ఎంచుకోవచ్చు. త్రివర్ణాలు కలిగిన దుద్దులను పెట్టుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్‌లు, నెక్ బ్యాండ్‌ల వంటి వాటిని వేసుకోవచ్చు. అల్ట్రా మోడర్న్‌గా ఉండేందుకు జెండా రంగులను పోలి ఉండే గ్యాడ్జెట్స్‌ని పెట్టుకోవచ్చు. నెయిల్ పెయింట్‌తోనూ దేశభక్తిని ప్రతిబింబించొచ్చు. గాగ్గుల్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కాస్త విభిన్నంగా ఆలోచించి మీలోని భావాలను వ్యక్త పరచవచ్చు. 

    తెలుపుతో ప్రయోగాలు..

    జెండాలోని ఒక్కో రంగు ఒక్కో అర్థాన్ని ప్రతిబింబిస్తుంది. కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, ఆకుపచ్చ సాఫల్యతకు సూచికలు. అశోక చక్రం ధర్మానికి ప్రతీక. ఇందులోనూ తెలుపు వర్ణానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయండి. స్వచ్ఛతతో పాటు శాంతి, మంచి తనం, సేఫ్‌టీ, పరిశుభ్రత, వెలుగులకు తెలుపు వర్ణం ఒక సూచిక. కాబట్టి, శ్వేత వర్ణంతో ప్రయోగాలు చేయండి. తెల్లటి వస్త్రాన్ని ధరించి దానిపై మీకు నచ్చిన రంగులను ఎంచుకోండి. పూర్తిగా తెలుపు వర్ణం ధరించినా ఫర్వాలేదు.  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv