ఇటీవల ప్రకటించిన 96వ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ (96th Academy Awards)లో ఈసారి హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్ హైమర్’ (Oppenheimer) సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. ఏకంగా ఏడు ఆస్కార్ పురస్కారాలు గెలుచుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా చూసేందుకు భారత సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఓపెన్‌హైమర్’ ఓటీటీలోకి వచ్చింది. ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జియో సినిమా’ (Jio Cinema)లో మార్చి 21 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ (Amazon prime)లో అందుబాటులో ఉంది. కానీ అది రెంటల్ విధానంలో ఉండటంతో చాలా మంది సినిమా చూడాలని ఉన్నప్పటికీ వెనకడుగు వేస్తూ వచ్చారు. తాజాగా ‘జియో సినిమా’.. ఎలాంటి రెంటల్ లేకుండా తన సబ్‌స్క్రైబర్స్ కోసం ఉచితంగా స్ట్రీమింగ్‌లోకి తీసుకువచ్చింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులు ఈ మూవీని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే ఈ సినిమా ప్రసారం అవుతోంది. అతి త్వరలోనే తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు జియో వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.
మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం
హాలీవుడ్‌కు చెందిన దిగ్గజ దర్శకుడు ‘క్రిస్టోఫర్ నోలన్’ (Christopher Nolan).. ‘ఓపెన్ హైమర్’ (Oppenheimer) సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటివరకు క్లాసిక్స్ తీసిన అతడు.. తొలిసారి ‘ఓపెన్ హైమర్’ అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం క్రిస్టోఫర్ కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. దాదాపు ఎనిమిది సార్లు నామినేషన్స్‌లో ఉన్న ఆయన.. తొలిసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నాడు. ఆస్కార్ తర్వాత ‘ఓపెన్ హైమర్’ మరింత పాపులర్ కావడంతో ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు దర్శకుడు క్రిస్టోఫర్ ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో ఈ సినిమా మళ్లీ విడుదలయ్యే అవకాశముంది.
8 రెట్లు లాభాలు
క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటివరకూ 13 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రతీ సినిమా దేనికదే ప్రత్యేకం. ‘ఓపెన్ హైమర్’కు ముందు ఆయన తీసిన ‘టెనెట్’ (Tenet) చిత్రం.. హాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ వచ్చిన హాలీవుడ్ చిత్రాలకు ఎంతో భిన్నంగా ఆ సినిమా ఉంటుంది. తాజా చిత్రం ‘ఓపెన్ హైమర్’ విషయానికి వస్తే.. ఈ సినిమాను క్రిస్టోఫర్ 100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. విడుదల అనంతరం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓపెన్ హైమార్ ఏకంగా 900 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. అంతేగాక అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హాలీవుడ్ చిత్రాల్లో టాప్-5 చోటు దక్కించుకుంది.
సినిమా కథేంటి
‘ఓపెన్ హైమర్’ స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా.. ప్రముఖ అమెరికన్ సైంటిస్ట్ జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్‌గా అతడి జర్నీ ఎలా మెుదలైంది? అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? జపాన్‌లోని హీరోషిమా – నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? ఆ దాడి తర్వాత ఓపెన్‌హైమర్ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపై అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది