అల్లు అర్జున్ (Allu Arjun), మెగా ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత వివాదాలు ఉన్నాయని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా ‘మట్కా’ ప్రమోషన్స్ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇందుకు మరింత ఊతం ఇచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి మద్దతు తెలపడం ఈ మెగా – అల్లు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అర్మీ రెండుగా చీలిపోయి సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అల్లు అర్జున్ చేసింది కరెక్ట్ కాదని పలువురు సినీ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే అదే వైసీపీ నేతకు తాజాగా అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడానికే బన్నీ ఇలా చేశాడన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) మరో రెండు వారాల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. సుకుమార్ – బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం దేశంలోని యావత్ సినీలోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ (Pushpa 2 Trailer)) రిలీజ్ కాగా దానికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ గురించి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి (Silpa Ravi Chandra Kishore Reddy) స్పందించారు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. థియేటర్లలో వైల్డ్ ఫైర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎక్స్‌లో పోస్టు చేశారు. అలాగే మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ సైతం చెప్పారు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ ‘థాంక్యూ బ్రదర్.. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’ అంటు రిప్లే ఇచ్చాడు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడా?
‘డీజే: దువ్వాడ జగన్నాథం’ సినిమాకు ముందు వరకు తన ప్రతీ సినిమా ఈవెంట్‌లో పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి గురించి బన్నీ (Allu Arjun) మాట్లాడుతూ వారిని ఆకాశానికెత్తారు. తొలిసారి డీజే ప్రమోషనల్ ఈవెంట్‌లో పవన్ గురించి ‘చెప్పను బ్రదర్’ అనడంతో మెగా ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. ఆ తర్వాత ‘డీజే’ సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి వదిలేశారు. అయితే ఏపీ ఎలక్షన్స్ టైమ్‌లో పవన్ ప్రత్యర్థి పార్టీ వైకాపా అభ్యర్థిగా ఉన్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి బన్నీ మద్దతు తెలిపడం, స్వయంగా నంద్యాల వెళ్లి ఓటు వేయాలని అక్కడి ప్రజలను అభ్యర్థించడం మెగా ఫ్యాన్స్, జనసైనికులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి బన్నీని హేట్ చేయడం ప్రారంభించారు. బన్నీని విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూాడా. అటు అల్లు అర్మీ సైతం వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇప్పుడు మరోమారు శిల్పా రవి రెడ్డికి థ్యాంక్స్ చెప్పి మరోమారు మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మెుదట శిల్పా రవి రెడ్డి పోస్టు చేశారని, దానికి బన్నీ రిప్లే మాత్రమే ఇచ్చారని అల్లు ఫ్యాన్స్ సమర్థించుకుంటున్నారు.
వైసీపీ నేతతో స్నేహం ఎలా కుదిరింది?
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్ ద్వారా ‘ఆల్ ది బెస్ట్’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ అప్పట్లో ఒక ట్వీట్ పెట్టి మాత్రమే ఊరుకున్న బన్నీ, ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా వెళ్లడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో కూటమి అభర్థిగా టీడీపీ నేత ఫరూఖ్ బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఐటెం సాంగ్‌పై క్రేజీ అప్‌డేట్!
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) ‘పుష్ప 2’ చిత్రంలో ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్పెషల్ సాంగ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. నవంబర్ 23న ‘కిస్సిక్’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన సైతం రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ పాటలో అల్లు అర్జున్ (Allu Arjun), శ్రీలీల తమ స్టెప్పులతో దుమ్మురేపారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ పాట కోసం శ్రీలీల రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ (Sreeleela Remuneration) తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ‘పుష్ప’లోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ సాంగ్ కంటే ‘కిస్సిక్’ ఇంకా పెద్ద హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
బన్నీపై గరికపాటి ఫైర్
‘పుష్ప 2’ సినిమా రిలీజ్‌కి దగ్గరపడుతున్న వేళా సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది. గతంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) ‘పుష్ప’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. ‘పుష్ప’ లాంటి సినిమాలు సమాజానికి హానికరమని 2021లో గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియోను తెరపైకి తీసుకొచ్చి కొందరు ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ ‘ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసం. సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి చివరలో మంచిగా చూపిస్తాం తదుపరి భాగం వరకూ వేచి చూడండి అంటారు. ఇది ఎంతవరకూ న్యాయం. ఈలోపు సమాజం చెడిపొవాలా? స్మగ్లింగ్ చేసే వ్యక్తి తగ్గేదే లే అంటాడా?. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. తగ్గేదే లే అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదు’ అంటూ మండిపడ్డారు.
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!