నటీనటులు: విష్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది, హర్ష వర్థన్ తదితరులు
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: మనోజ్‌రెడ్డి కాటసాని
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిర్మాత: రామ్ తాళ్లూరి
విడుదల తేదీ: 22-11-2024
యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwak Sen) నుంచి ఈ ఏడాది వచ్చిన ‘గామి’ (Gaami), ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky Review)తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు విష్వక్ (Vishwaksen) వచ్చేశాడు. అతడు నటించిన మెకానిక్ రాకీ చిత్రం నవంబర్ 22న గ్రాండ్‌గా రిలీజైంది. ఇందులో విష్వక్‌కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) చేశారు. రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. విష్వక్ హ్యాట్రిక్ కొట్టాడా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
రాకీ (విష్వక్ సేన్) బీటెక్ మధ్యలోనే ఆపేసి తండ్రి రామకృష్ణ (నరేష్) నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా చేరిపోతాడు. రిపేర్లతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఈ క్రమంలో అతడి దగ్గర డ్రైవింగ్ నేర్చుకునేందుకు మాయ (శ్రద్ధ శ్రీనాథ్), ప్రియా (మీనాక్షి చౌదరి) జాయిన్ అవుతారు. తను చదువుకునే రోజుల్లోనే ప్రియను రాకీ ఇష్టపడతాడు. కాలేజీ మానేయడంతో వారు విడిపోతారు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కలిసిన ప్రియకు రాకీ దగ్గరయ్యాడా? ఆమె గురించి రాకీకి తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? వాళ్ల లైఫ్‌ను మాయ ఏ విధంగా ప్రభావితం చేసింది? కథలో రాంకీ రెడ్డి (సునీల్) ఎవరు? అతడి ఎంట్రీతో రాకీకి వచ్చిన సమస్యలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
విష్వక్ సేన్ (Mechanic Rocky Review) ఎప్పటిలాగే సెటిల్ నటనతో అదరగొట్టాడు. హుషారైన పాత్రలో ఎంతో యాక్టివ్‌గా కనిపించి ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైనా పంచ్‌లతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాడు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెప్పించారు. అందంగా కనిపిస్తూ హావభావాలను చక్కగా పలికించారు. కొన్ని సన్నివేశాల్లో పోటీపడి మరి నటించారు. తెరపై మీనాక్షి, విష్వక్ సేన్ కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వారి లవ్‌ట్రాక్ కూడా బాగుంది. సునీల్, నరేష్, హర్షవర్ధన్‌కు కూడా బలమైన పాత్రలే దక్కాయి. హర్ష చెముడు తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడ నవ్వించాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ట్రయాంగిల్ లవ్‌స్టోరీకి ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను జోడించి నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు రవితేజ ముళ్లపుడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో బలమైన అంశాలను తెరపై చూపినప్పటికీ, అవసరానికి మించిన కమర్షియల్ హంగులు, కామెడీ సన్నివేశాలు కారణంగా అవి తెలిపోయాయి. ఫస్టాఫ్ మెుత్తం పాత్రల పరిచయానికి, హీరో హీరోయిన్ల లవ్‌ట్రాక్, కమర్షియల్ హంగులు, పాటలు మధ్య రొటిన్‌గా సాగిపోతుంది. సాగదీసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. సెకండాఫ్ నుంచి అసలైన కథలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. ద్వితీయార్థమే సినిమాకు బలం. అనూహ్యమైన ట్విస్టులు, ప్రతీ పాత్ర కథను మరో మలుపుకు తీసుకెళ్లడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మిడిల్ క్లాస్ వారి కోరికలను ఆసరగా చేసుకొని కొందరు ఎలా మోసం చేస్తారో దర్శకుడు చక్కగా చూపించాడు. ఫస్టాఫ్ విషయంలో దర్శకుడు జాగ్రత్తపడి ఉంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ అయ్యేదని చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాలకు వస్తే (Mechanic Rocky Review) సినిమా ఉన్నతంగా ఉంది. జేక్స్ బిజోయ్ (Mechanic Rocky music director) నేపథ్య సంగీతం చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ తనకు ఇచ్చిన బాధ్యతను వందశాతం నెరవేర్చాడు. ఫస్టాఫ్ విషయంలో ఎడిటర్ మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- విష్వక్ నటన
- సెకండాఫ్
- ట్విస్టులు
మైనస్ పాయింట్స్
- ప్రథమార్థం
- కమర్షియల్ హంగులు
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది