అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కిస్సిక్ అనే (Kissik Song) ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మేకర్స్ స్పెషల్ పోస్టర్ వేసి మరి తెలియజేశారు. అంతకుముందు సెట్‌లో శ్రీలీల, బన్నీ డ్యాన్స్‌కు సంబంధించి ఓ ఫోటో సైతం లీకయ్యింది. దీంతో ఈ సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందోనని అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ రిలీజ్‌కు రెండు వారాల సమయమే ఉండటంతో మూవీ టీమ్ వరుసగా అప్‌డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలీల చేసిన ఐటెం సాంగ్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.
ఆ రోజు మోతమోగాల్సిందే!
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ యావత్ సినీ లోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప 2 టీమ్ క్రేజీ అప్‌డేట్‌ను ప్రేక్షకులకు ఇచ్చింది. ప్రేక్షకుల్లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన ‘కిస్సిక్’ సాంగ్ (Kissick Song)ను నవంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు సా.7.02 పాట విడుదల కానున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక పోస్టర్‌లో బన్నీ, శ్రీలీల లుక్ అదిరిపోయింది. సాంగ్‌లోని ఓ స్టెప్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని ఈ పోస్టర్‌ను క్రియేట్ చేశారు. తాజా అప్‌డేట్ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సాంగ్ పక్కాగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఎందుకంత హైప్?
డైరెక్టర్ సుకుమార్ తన ప్రతీ చిత్రంలోనూ ఓ ఐటెం సాంగ్ (Kissik Song) తప్పనిసరిగా ఉంచుతారు. ఫస్ట్ ఫిల్మ్ ‘ఆర్య’ నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. సుకుమార్ ఇప్పటివరకూ 8 చిత్రాలు చేయగా అన్నింట్లోను దుమ్మురేపే ఐటెం సాంగ్స్ ఉన్నాయి. అయితే ‘కిస్సిక్’ పాటకు వస్తున్నంత హైప్ గతంలో ఏ పాటకు రాలేదు. సుకుమార్ గత చిత్రం ‘పుష్ప’లోని ‘ఊ అంటావా ఊఊ అంటావా’కు సైతం రిలీజ్‌కు ముందు ఇంత బజ్ క్రియేట్ కాలేదు. అయితే ‘కిస్సిక్’కు మాత్రమే ఈ స్థాయి హైప్ ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘పుష్ప’కి మించి ‘పుష్ప 2’ ఉంటుందని చిత్ర బృందం ముందు నుంచి చెబుతూ వస్తోంది. దీంతో ఇండియాను షేక్ చేసిన ‘ఊ ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ కంటే ‘కిస్సిక్’ ఇంకా అదిరిపోతుందని ఆడియన్స్ ఓ అభిప్రాయానికి వచ్చేశారు. దానికి తోడు డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సాంగ్‌లో చేస్తుండటం, సమంత కంటే బెటర్ డ్యాన్సర్ కావడం, బన్నీ కూడా స్టెప్పులు ఇరగదీస్తాడని పేరుండటంతో ఈ సాంగ్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
శ్రీలీల దెబ్బకు ఫ్లోర్లు అదరాల్సిందే!
‘పుష్ప 2’ ఐటెం సాంగ్ ఎలా ఉన్నా శ్రీలీల డ్యాన్స్ మాత్రం అదిరిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుత తరం కథానాయికల్లో డ్యాన్స్‌లో శ్రీలీలను కొట్టేవారే లేరనడంతో అతిశయోక్తి లేదు. ఈ భామ తన నటన కంటే డ్యాన్స్ పరంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజ ‘ధమాకా’ చిత్రంలో పల్సర్ బైక్ సాంగ్‌లో ఈ అమ్మడు ఏవిధంగా అదరగొట్టిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా మహేష్ బాబుతో ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌లో ఏకంగా తన స్టెప్పులతో విధ్వంసం సృష్టించింది. శ్రీలీలతో డ్యాన్స్ అంటే హేమా హేమీ డ్యాన్సర్లు సైతం కాస్త వెనక్కి తగ్గుతుంటారు. అటువంటి శ్రీలీలతో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే బన్నీ జతకలిస్తే ఇక ఐటెం సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయవచ్చు.
ఏరికోరి సెలెక్ట్ చేసిన బన్నీ!
‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్ (Kissik Song)కు శ్రీలీలను ఎంచుకోవాలన్నది డైరెక్టర్ సుకుమార్ ఆలోచన కాదట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా శ్రీలీలను సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. వీరిద్దరి కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లోనే సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. మరోవైపు ఈ జనరేషన్ హీరోయిన్లలో శ్రీలీల బెస్ట్ డ్యాన్సర్ కీర్తింప బడుతోంది. ఈ నేపథ్యంలో బన్నీ-శ్రీలీల ఒకే వేదికపై ఆడి పాడితే ఆడియన్స్‌లో పూనకాలు రావడం పక్కా. ఇవన్నీ ఆలోచించే శ్రీలీలపై బన్నీ మెుగ్గు చూపినట్లు సమాచారం. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శ్రద్ధా కపూర్, దిశా పటానీ, త్రిప్తి దిమ్రి పేర్లు ఈ ఐటెం సాంగ్ పరిశీలనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
శ్రీలీల పారితోషికం ఎంతంటే?
అల్లుఅర్జున్ – సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా సుకుమార్‌గా తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్రమంలో కిస్సిక్ ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)లో చేసిన హీరోయిన్ శ్రీలీలకు భారీ మెుత్తంలో పారితోషికం ముట్టచెప్పినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ‘కిస్సిక్కి’ అంటూ సాగే ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెట్, హీరోయిన్ పారితోషికం ఇతర మొత్తం కలిపి రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నాయి.
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!