హాట్ బ్యూటీ నేహా శర్మ (Actress Neha Sharma) ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ భామ ముద్దు ముద్దు తెలుగు మాటలకు ఇక్కడి యూత్ ఫిదా అయ్యింది. ఆ తర్వాత ‘కుర్రాడు’ అనే సినిమాలో మెరిసినప్పటికీ అది సక్సెస్ కాలేదు. దీంతో హిందీకి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ వరుస చిత్రాలు చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఇవాళ (నవంబర్ 21) నేహా శర్మ పుట్టిన రోజు. 36వ సంవత్సరంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేహా శర్మ 1987 నవంబరు 21న బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్ శర్మ (Ajith Sharma) ప్రముఖ పొలిటిషియన్.
భాగల్‌పూర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014, 2015, 2020లో పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
బాలీవుడ్ నటి ఐషా శర్మ (Aisha Sharma) ఈ భామకు స్వయనా సోదరి అవుతుంది. 2018లో వచ్చిన ‘సత్యమేవ జయతే’తో ఐషా హిందీలో అడుగుపెట్టింది.
భాగల్‌పుర్‌లోని మౌంట్ కార్మెల్ స్కూల్‌లో నేహా శర్మ (HBD Neha Sharma) చదువుకుంది. ఆ తర్వాత ఢిల్లీలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’లో ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేసింది.
నేహా శర్మ చిన్నప్పుడు ఆస్తమాతో చాలా బాధలు అనుభవించింది. ఆస్తమా వల్ల పలుమార్లు ఆనారోగ్యానికి గురైందట. ఫ్యామిలీ సపోర్ట్‌తో దాని నుంచి బయటపడింది.
నేహా శర్మ (HBD Neha Sharma)కు వంట చేయడం చాలా ఇష్టం. అలాగే పాటలు వినడం, పుస్తకాలు చదవడం, డ్యాన్స్ చేయడం ఆమె హాబీలుగా చెప్పవచ్చు.
డ్యాన్స్‌పై నేహాకు చాలా పట్టు ఉంది. ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. కథక్‌లో ఆమెకు ప్రావీణ్యం ఉంది.
సంప్రదాయ నృత్యంతో పాటు హిప్ హాప్, సల్సా, మరెంగ్యూ, జివ్, జాజ్ వంటి ఆధునిక నృత్యంలోనూ నేహాకు ప్రమేయం ఉంది.
లండన్‌లోని ప్రముఖ ‘పైనాపిల్ డ్యాన్స్ స్టూడియోస్’ (Pineapple Dance Studios) ఆమె వెస్ట్రర్న్ డ్యాన్స్ కోర్సులను నేర్చుకుంది.
నేహా శర్మకు క్యారెట్‌తో చేసిన కేక్ చాలా ఇష్టమట. కనిపిస్తే కేజీ కేకునైనా అలవొకగా తినేస్తుందని ఆమె ఫ్రెండ్స్ చెబుతారు.
నేహా శర్మకు ఇష్టమైన నటులు ఇండియాలో ఎవరు లేరట. ఆమెకు హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ (Will Smith) అంటే విపరీతమైన అభిమానమట.
హీరోయిన్ల విషయానికే వస్తే ఆమె (HBD Neha Sharma)కు ఇద్దరు ఫేవరేట్ యాక్ట్రెస్ ఉన్నారు. అందులో ఒకరు విద్యాబాలన్ కాగా, మరొకరు మధుబాల.
నేహా శర్మ హిందీ, ఇంగ్లీషు చిత్రాలు బాగా చూస్తారు. హాలీవుడ్‌లో 2006లో వచ్చిన ‘పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్’ (The Pursuit of Happyness) బాగా నచ్చిన ఫిల్మ్.
నేహా శర్మకు పర్యటనలు అంటే చాలా ఇష్టం. ఏమాత్రం తీరిక దొరికిన వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తుందట. థాయిలాండ్ ఆమెకు బాగా నచ్చిన టూరిజం ప్లేస్.
నాని నటించిన రీసెంట్ చిత్రం ‘హాయ్ నాన్న’లో నేహా శర్మ మోడల్‌గా ఒక చిన్న క్యామియో ఇచ్చింది. కానీ అది పెద్దగా హైలెట్ కాలేదు.
హిందీలో త్రిప్తి దిమ్రి – విక్కీ కౌషల్ జంటగా నటించిన ‘బ్యాడ్ న్యూస్’ మూవీలోనూ ఈ అమ్మడు తళుక్కున మెరిసింది. సెజల్ అనే పాత్రలో కనువిందు చేసింది.
రీసెంట్‌గా ‘36 డేస్‘ అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో నేహా (HBD Neha Sharma) ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం తెలుగులో ఏ ప్రాజెక్ట్ చేయడం లేదు. హిందీలో ‘దే దే ప్యార్ దే 2’ చిత్రంలో నేహా శర్మ నటిస్తోంది.
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్ సర్కార్ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?