మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో ‘RC17’ చిత్రాన్ని చరణ్ చేయనున్నాడు. ‘రంగస్థలం’ (Rangasthalam) లాంటి బ్లాక్బాస్టర్ హిట్ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రానుండటంతో ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ‘RC17’పై దర్శకధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కేద్దాం.
చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో..!
‘RC 17’ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా మెుదలు కాకముందే ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ వార్త హల్చల్ చేస్తోంది. దాని ప్రకారం ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందట. మద్రాసు పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అప్పటి సామాజిక నిబంధనలను ధిక్కరించిన ఓ గుఢాచారి (స్పై) ఎమోషనల్ యాక్షన్ జర్నీనే ఈ సినిమా అని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి వ్యాఖ్యలు వైరల్
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ సమయంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. ‘RC17’ చిత్రం గురించి మాట్లాడారు. ‘రామ్ చరణ్‌తో సుకుమార్ తీయనున్న సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్ సీన్ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్‌కు వచ్చేస్తారని మాత్రం కచ్చితంగా నమ్ముతున్నాను’ అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
‘ఓపెనింగ్ సీన్ అద్భుతం’
మరోవైపు రాజమౌళి తనయుడు కార్తికేయ (Karthikeya) కూడా ‘RC 17’పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు చరణ్ చెప్పాడు. ఆ సినిమాలో ఓపెనింగ్ సీన్ గురించి వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుందని.. అద్భుతమని తెలిపాడు. నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. ఈ మూవీ వీరి కెరీర్లోనే మైలురాయి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్ చేయలేను’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు చిత్రబృందాన్ని ట్యాగ్ చేశారు.
ఈ ఏడాది చివర్లో ప్రారంభం!
ప్రస్తుతం రామ్‌చరణ్.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. దీనిని స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) రూపొందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu)తో చరణ్ ‘RC16’ సినిమాను పట్టాలెక్కిస్తాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తైన వెంటనే ‘RC17’ సెట్లోకి రామ్‌చరణ్ అడుగుపెడతాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా మెుదలవుతుందని సమాచారం. వచ్చే ఏడాది చివరిలో ‘RC17’ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.
రేపు అదిరిపోయే ట్రీట్!
రేపు గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఉదయం 9.00 గంటలకు ఈ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రూపొందించిన ఈ పాట కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జే సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం