మోటోరోలా నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫొన్ Motorola Edge 50 Neo భారత మార్కెట్‌లోకి విడుదలైంది. ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వేళ.. ఈ స్మార్ట్ ఫొన్ మార్కెట్‌లోకి విడుదల కావడం విశేషం. ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైన కెమెరాలను కలిగిన స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఇప్పటికే మోటోరోలా నియో సిరీస్‌లో Edge 50 Neo, Edge 50 Fusion, Edge 50, Edge 50 Pro, Edge 50 Ultra లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
Motorola Edge 50 Neo, Edge 50 Fusion కంటే కొంచెం తక్కువ ప్రైస్‌లో వచ్చింది. అయినప్పటికీ ఇది చాలా ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. అయితే, అసలు హైలైట్ ఏమిటంటే, ఇందులోని ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌లో అల్ట్రావైడ్, టెలిఫోటో సెన్సార్‌లు ఉంటాయి, ఇవి సబ్-25K సెగ్మెంట్‌లో చాలా అరుదుగా కనిపిస్తాయి.
Motorola Edge 50 Neo స్పెసిఫికేషన్లు
Motorola Edge 50 Neo, MediaTek Dimensity 7300 SoCతో పనిచేస్తుంది, 8GB LPDDR4x RAM మరియు 256GB UFS 2.2 స్టోరేజ్ కలిగివుంటుంది.
డిస్‌ప్లే
ఈ స్మార్ట్ ఫోన్ 6.4-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది, ఇది 1.5K (2712 x 1220 పిక్సెల్స్) సూపర్ HD రిజల్యూషన్‌తో ఉంటుంది. అంతేకాకుండా, ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేటుతో 360Hz టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది. దీనిలో LTPO టెక్నాలజీని ఉపయోగించి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. స్క్రీన్ గరిష్టంగా 2,800 నిట్స్ బ్రైట్నెస్, 460 PPI పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుంది.
బ్యాటరీ
ఫోన్ 4,310 mAh బ్యాటరీతో వస్తుంది, దీని ద్వారా 68W వైర్డ్ మరియు 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. Edge 50 Neoలో డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి.
కెమెరా
Motorola Edge 50 Neo, ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50MP Sony LYTIA-700C ప్రైమరీ సెన్సార్, 120° FOVతో 13MP అల్ట్రావైడ్ లెన్స్, మాక్రో విజన్ సపోర్ట్, 3x ఆప్టికల్ జూమ్, OISతో 10MP టెలిఫోటో యూనిట్ ఉన్నాయి. దీని వల్ల లోటైట్‌లో కూడా నాణ్యమైన ఫొటోలు లభిస్తాయి. ముందుభాగంలో, Edge 50 Neo 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది, ఇది ఆటోఫోకస్ f/2.4 అపెర్చర్‌తో ఉంటుంది.
ఆపరేటింగ్
Motorola Edge 50 Neo Android 14 ఆధారంగా Hello UIను రన్ చేస్తుంది. Motorola Edge 50 Neoకు ఐదేళ్ళ పాటు Android OS, ఐదేళ్ళ సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయని కూడా మోటరోలా ధృవీకరించింది. Motorola Edge 50 Neo IP68 రేటింగ్‌తో వస్తుంది. ఇది డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది. అలాగే MIL-810H మిలటరీ-గ్రేడ్ డ్యూరబులిటీ కలిగి ఉండటం ఈ గ్యాడ్జెట్ ప్రత్యేకత.
Edge 50 Neo ధర
Motorola Edge 50 Neo ధర 8GB/256GB మోడల్ కోసం రూ. 23,999 నుంచి ప్రారంభమవుతుంది.
కలర్స్
ఎడ్జ్ 50 నియో “పాంటోన్ పోయిన్సియానా, పాంటోన్ లాట్టే, పాంటోన్ గ్రిసైల్ మరియు పాంటోన్ నాటికల్ బ్లూ” రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
ఆఫర్లు
Motorola Edge 50 Neo భారతదేశంలో సెప్టెంబర్ 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌లలో లభిస్తుంది. ఇతర ప్రధాన రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు Edge 50 Neoపై రూ. 1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!