భారత మార్కెట్లో విస్తృతమైన మొబైల్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నంలో వివో తన కొత్త Y సిరీస్ స్మార్ట్‌ఫోన్, వివో Y300ను విడుదల చేయబోతోంది. ప్రత్యేకమైన డిజైన్, మెరుగైన ఫీచర్లతో ఈ ఫోన్ త్వరలోనే విడుదల కానుంది. మెరుగైన కెమెరా పనితీరం, వేగవంతమైన ఛార్జింగ్ వ్యవస్థ, ప్రీమియం మెటాలిక్ డిజైన్ వంటి ఆవిష్కరణలతో ఈ ఫోన్ వినియోగదారుల్ని ఆకర్షించడమే కాకుండా మిడ్‌రేంజ్ విభాగంలో సరికొత్త ప్రమాణాలు నిర్దేశిస్తోంది. మరి ఈ స్మార్ట్ ఫొన్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
వివో Y300 విడుదల తేదీ
- వివో తన X హ్యాండిల్ ద్వారా Y300 లాంచ్ తేదీని ప్రకటించింది
- భారత్ మార్కెట్లో నవంబర్ 21, మధ్యాహ్నం 12 గంటలకు విడుదల
డిజైన్
- టైటానియం తరహా మెటీరియల్‌తో స్లీక్ డిజైన్
- మునుపటి Y200 మోడల్‌తో పోలిస్తే మెరుగైన డిజైన్
- బాక్సీ డిజైన్, మెటాలిక్ ఫ్రేమ్ కలిగిన ఆకర్షణీయ రూపకల్పన
- వెనుక వైపు అరా లైట్ ఫీచర్‌తో అందుబాటులో రానుంది
రంగులు
- మూడు రంగుల్లో లభ్యం
- డార్క్ పర్పుల్,
- సీ గ్రీన్,
- గ్రే
డిస్‌ప్లే మరియు ప్రాసెసర్
- 6.67 అంగుళాల FHD+ (1080*2400) అమోలెడ్ డిస్‌ప్లే
- 120Hz రీఫ్రెష్ రేట్ తో చక్కటి విజువల్స్
- స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్
- 8GB ర్యామ్‌తో వేగవంతమైన పనితీరు
ఆపరేటింగ్ సిస్టమ్ మరియు బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14
- స్టోరేజ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
- 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ
కెమెరా వివరాలు
- వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్
- 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా
- 8MP సెకండరీ కెమెరా
- 32MP సెల్ఫీ కెమెరా, వీడియో కాల్స్ కోసం
కనెక్టివిటీ- భద్రత
- కనెక్టివిటీ: బ్లూటూత్ 5.0, Wi-Fi 5, GPS, USB-C పోర్ట్
- మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు
- IP64 రేటింగ్: డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్
- భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ధర
- 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.23,999
వివో Y300 ప్లస్ ఫీచర్లు
- 6.78 అంగుళాల FHD+ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే
- 6nm స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్
- 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ
- వెనుక వైపు 50MP + 2MP కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరా
- 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.23,999
- గ్రీన్, బ్లాక్ రంగుల్లో లభ్యం