• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amaran Collections: తెలుగులో 500% లాభాలతో దుమ్మురేపిన ‘అమరన్‌’.. ఎంత వచ్చాయంటే?

    కోలీవుడ్‌ స్టార్ యాక్టర్‌ శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కిన చిత్రం అమరన్‌ (Amaran). అమరుడైన మేజర్‌ ముకుంద్‌ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. విడుదలై 19 రోజులు అయినా ఇప్పటికీ అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. అటు తెలుగులోనూ రికార్డు వసూళ్ల (Amaran Collections)ను రాబడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. థియేటర్లలో పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో అదరగొడుతోంది. ఫలితంగా నటుడు శివకార్తికేయన్‌ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. 

    రూ.300 కోట్ల క్లబ్‌లోకి..

    శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌. దీపావళిని పురస్కరించుకుని అక్టోబర్‌ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి 19 రోజుల్లో ఈ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్‌ (Amaran Collections)ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మేరకు ‘మెగా బ్లాక్‌ బాస్టర్’ అంటూ మేకర్స్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శివకార్తికేయన్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రూ.300 కోట్ల మార్క్ అందుకోలేదు. అమరన్‌తోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం. 

    తెలుగులో లాభాలే లాభాలు..

    ‘అమరన్‌’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ తెలుగు హక్కులు రూ.4 కోట్లకు అమ్ముడు పోగా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.8 కోట్లుగా నిలిచింది. అయితే తెలుగులో ఎవరు ఊహించని స్థాయిలో ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకూ రూ.41 కోట్ల గ్రాస్‌ (Amaran Collections) వసూళ్లను అమరన్‌ సాధించింది. 500% లాభాలతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అటు తమిళనాడులోనే రూ.143 కోట్లను ‘అమరన్‌’ తన ఖాతాలో వేసుకుంది. అలాగే కేరళలో రూ.11.50 కోట్లు, కర్ణాటకలో రూ.22 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.4.5 కోట్లు, ఓవర్సీస్‌లో ఏకంగా రూ.79 కోట్లను కొల్లగొట్టింది. ఈ స్థాయి రెస్పాన్స్‌ చూసి అమరన్‌ టీమ్‌ తెగ ఖుషీ అవుతోంది. 

    కలిసొచ్చిన కంగువా ఫ్లాప్‌.. 

    నిజానికి అమరన్‌ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించినా ఈ స్థాయి వసూళ్లు వస్తాయని వారు కూడా ఊహించలేదు. ఎందుకంటే సూర్య నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువా’ వల్ల తమ లాంగ్‌ రన్‌ కలెక్షన్స్ దెబ్బతింటాయని భావించారు. అయితే నవంబర్‌ 14న వచ్చిన ‘కంగువా’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో సినీ లవర్స్‌ అమరన్‌ మెయిన్‌ ఛాయిస్‌గా మారిపోయింది. థియేటర్‌లో మంచి సినిమాను అస్వాదించాలని అనుకునేవారంతా కుటుంబంతో సహా అమరన్‌కు వెళ్తున్నారు. దీని కారణంగానే మూవీ వచ్చి మూడు వారాలు అవుతున్న బాక్సాఫీస్‌ (Amaran Collections) వద్ద జోరు తగ్గలేదు. ఈ వారం కూడా పెద్ద స్టార్‌ హీరోల చిత్రాలు లేకపోవడంతో కలెక్షన్స్ ఇదే రీతిలో పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    నెలాఖరులో ఓటీటీలోకి..

    థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘అమరన్‌’ (Amaran OTT Release) ఈ నెలాఖరులో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్‌ 29 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ వసూళ్ల (Amaran Collections) దృష్ట్యా రిలీజ్‌ డేట్‌ను పోస్ట్‌ పోన్‌ చేయాల్సి వస్తే డిసెంబర్‌ 5వ తేదీనైనా పక్కాగా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. దీంతో ఇప్పటివరకూ థియేటర్లలో చూడని వారంతా ‘అమరన్‌’ ఓటీటీ రాకకోసం తెగ ఎదురుచూస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv