గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో బిగ్ ప్రాజెక్ట్ కావడంతో ప్రస్తుతం అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. రిలీజ్‌కు మరో 25 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి నాల్గో సింగిల్ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు థమన్ ఈ పాటపై అమాంతం హైప్ పెంచేశాడు. దాంతోపాటు ‘గేమ్ ఛేంజర్’కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
సాంగ్‌పై హైప్ పెంచేసిన థమన్
రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా చేసిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) నుంచి సాలిడ్ అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (S.S. Thaman) సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నాల్గో సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘డోప్’ (DHOP Song) అనే పాట రాబోతోందని, ఇది సౌండ్ ఛేంజర్ అవుతుందని, ఈ పాట గురించి ప్రపంచం మాట్లాడుకుంటుందని వరుస ట్వీట్స్‌తో థమన్ హోరెత్తించారు. దీంతో ‘డోప్’ సాంగ్‌పై ఒక్కసారిగా నెట్టింట చర్చ మెుదలైంది. ఈ పాట గురించి ప్రముఖ సింగర్ గీతా మాధురి మాట్లాడిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ సాంగ్ తాను విన్నానని, ఒకసారి పాట రిలీజైతే ప్రపంచం మెుత్తం మీ వైపు చూస్తుందని థమన్‌తో చెప్పినట్లు ఆమె గుర్తుచేశారు. అయితే ‘డోప్’ పాటను యూఎస్ ఈవెంట్లో రిలీజ్ చేస్తారని సమాచారం. అక్కడే ట్రైలర్‌ను కూడా లాంచ్ చేస్తారని టాక్ ఉంది.
‘బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు’
గేమ్ ఛేంజర్ సినిమాలో నటుడు రాజీవ్ కనకాల (Rajiv Kanakala) సైతం ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమాతో పాటు రామ్‌చరణ్ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఈయన (రామ్‌చరణ్) గ్లోబల్ స్టార్. రైజ్‌లో ఉన్న గ్లోబల్ స్టార్. ట్రెజర్ (సంపద) లాంటి వ్యక్తి. పద్మనాభ స్వామి టెంపుల్లో తీసిన నేల మాళిగ లాంటి వ్యక్తి చరణ్. ఈ సినిమాకు కలెక్షన్స్ వస్తాయని మేము చాలా నమ్మకంతో ఉన్నాం. సాంగ్స్ కూడా అద్భుతంగా తీశారు. నేను విన్నదైతే ఒక్కొక్క సాంగ్ రూ.10-12 కోట్లు ఖర్చు అయ్యింది. బ్రహ్మాండంగా సినిమాను ఎంజాయ్ చేస్తారు. కథలోని డ్రామా కూడా అదే స్థాయిలో ఉంటుంది’ అని రాజీవ్ అన్నారు.
చరణ్ యాక్టింగ్‌కు షాకవుతారు: శ్రీకాంత్
‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ (Srikanth) కూడా ముఖ్యమైన రోల్ పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాపై శ్రీకాంత్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌లో మరింత హైప్‌ను పెంచుతున్నాయి. ఇందులో చరణ్ పోషించిన అప్పన్న పాత్ర చూసి ఫ్యాన్స్ షాకవుతారని ఆయన అన్నారు. ఇందులో విలన్‌గా చేస్తోన్న తమిళ నటుడు ఎస్.జే. సూర్యకు ‘సరిపోదా శనివారం‘కు మించిన ప్రశంసలు వస్తాయని పేర్కొన్నారు. డైరెక్టర్ శంకర్ రీసెంట్ చిత్రాలు మిస్‌ఫైర్ అయ్యాయని, గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం అలా జరగదని భరోసా ఇచ్చారు. కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటుందని చెప్పుకొట్టారు. ట్విస్టుల మీద ట్విస్టులతో ఆద్యాంతం ఆడియన్స్‌ను అలరిస్తుందని శ్రీకాంత్ అన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్
‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నారు. ఓవర్సీస్లోనూ ఈ సినిమాపై బజ్ ఉంది. దీంతో నేటి నుంచి కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌ను మేకర్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చరణ్ కుర్చీలో కూర్చొని ఎంతో దర్జాగా కనిపించాడు. ఇదిలా ఉంటే ఓవర్సీస్లోనే గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనన్నారు. డిసెంబర్ 21న గార్లాండ్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్లో ఈ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్ కోసం ఓవర్సీస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్