ఆసియా కప్‌లో ఘోర పరాభవంతో ఇంటికి బయలుదేరిన టీమిండియా గొప్పగా పుంజుకుంది. వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. T20 ప్రపంచకప్ ముందు సన్నాహక సిరీస్‌లుగా వీటిని పరిగణిస్తున్నా తేలికగా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడబోయే జట్టుతో ప్రపంచకప్‌లో భారత్ పోటీ పడనుంది. అక్టోబరు 30న ఇండియా, సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో జరగనున్న IND Vs SA T20 సిరీస్‌ను రెండు జట్లూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
భారత్‌దే ఆదిపత్యం..
అంతర్జాతీయ టీ20ల్లో రెండు జట్లు 20 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 11 మ్యాచ్‌లను సొంతం చేసుకోగా.. సౌతాఫ్రికా 8 మ్యాచుల్లో నెగ్గింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇందులో ఇరు జట్లు తమ ప్రత్యర్థి గడ్డపై సమంగా(5) మ్యాచ్‌లు గెలిచాయి. హోం గ్రౌండ్లో భారత్ 3 విజయాలు సాధిస్తే.. దక్షిణాఫ్రికా రెండు నెగ్గింది. తటస్థ వేదికల్లో భారత్‌దే పైచేయి. నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. మూడింట్లో ఇండియా నెగ్గింది. ఇలా స్థూలంగా సౌతాఫ్రికాపై భారత్ ఆదిపత్యం కొనసాగుతోంది.
భారత్‌లో సౌతాఫ్రికా ప్రదర్శన..
ఇప్పటివరకు భారత్‌లో సౌతాఫ్రికా మూడు టీ20 సిరీస్‌లు ఆడింది. 2015, 2018, 2022(జూన్)లో పొట్టి ఫార్మాట్ సిరీస్ కోసం సఫారీలు భారత్‌కు వచ్చారు. 2015 అక్టోబరులో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని సఫారీలు 2-0తో సొంతం చేసుకున్నారు. 2018లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ని 1-1తో దక్షిణాఫ్రికా డ్రా చేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ని(2-2) కూడా డ్రాతో ముగించింది. ఆశ్చర్యమేమిటంటే.. ఈ మూడు సిరీసుల్లోనూ సగటుగా ఒక మ్యాచ్ అసలు జరగలేదు. ఇప్పుడు మరోసారి భారత్‌తో తలపడనుంది.
మనోళ్లే పరుగుల వీరులు
రెండు జట్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో వెటరన్ సురేశ్ రైనా ఉన్నాడు. మూడో స్థానంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ జేపీ డుమినీ, నాలుగో స్థానంలో విరాట్, ఐదులో శిఖర్ ధావన్ ఉన్నారు.
ర్యాంక్ | ప్లేయర్ | మ్యాచులు | పరుగులు | అ.స్కో | సగటు | 100s | 50s |
1 | రోహిత్ శర్మ | 13 | 362 | 106 | 32.90 | 1 | 2 |
2 | సురేశ్ రైనా | 12 | 339 | 101 | 33.90 | 1 | 0 |
3 | జేపీ డుమినీ | 10 | 295 | 68* | 59.00 | 0 | 3 |
4 | విరాట్ కోహ్లీ | 10 | 254 | 72* | 36.28 | 0 | 2 |
5 | శిఖర్ ధావన్ | 7 | 233 | 72* | 33.28 | 0 | 1 |
సెంచరీలు.. అత్యధిక స్కోరు
ద్వైపాక్షిక సిరీసుల్లో కేవలం ఇద్దరు మాత్రమే సెంచరీలు చేశారు. అది కూడా భారత్ బ్యాట్స్‌మెన్ కావడం గమనార్హం. రోహిత్, సురేశ్ రైనా ఈ లిస్టులో ఉన్నారు. హైఎస్ట్ స్కోరు రోహిత్ శర్మ(106) పేరిట ఉంది. ఆ తర్వాత రైనా(101) నిలవగా, హెన్రిచ్ క్లాసెన్ (81)తో మూడో స్థానంలో ఉన్నాడు.
అత్యధిక వికెట్లు
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ తొలి స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా 14 వికెట్లు రాబట్టి అగ్రస్థానానికి ఎగబాకాడు. ఒక మ్యాచులో అత్యుత్తమ ప్రదర్శన (5/14) కనబరిచిన ఆటగాడిగానూ భువీ ముందున్నాడు. ఈ సిరీస్‌లో భువీ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారేమో వేచి చూడాలి.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?