భారత మహిళలు జట్టు ఓటమి
దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా 18 ఓవర్లలోనే చేధించింది. ఇందులో ట్రయాన్ 51 పరుగులు అర్ధ శతకంతో మెరిసింది. భారత బౌలర్లలో స్నేహా రానా రెండు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్ తలో వికెెట్ చేశారు. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన డకౌట్, జెమీయా రోడ్రిగ్స్ నిరాశపర్చారు.