• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun – Atlee: తమిళ స్టార్‌ డైరెక్టర్‌తో బన్నీ సినిమా షురూ.! ముహూర్తం ఎప్పుడంటే?

    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం తన కెరీర్‌లో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ (Pushpa: The Rise)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న బన్నీ.. ఆ మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రానికి గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొని సత్తా చాటాడు. టాలీవుడ్‌ నుంచి ఈ అవార్డు అందుకున్న మెుట్టమెుదటి హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ (Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా బన్నీ – అట్లీ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది. 

    బన్నీ నెక్స్ట్‌ మూవీ అట్లీతోనే!

    ‘పుష్ప 2’ మూవీ తర్వాత అల్లు అర్జున్‌ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. త్రివిక్రమ్ (Trivikram), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), బోయపాటి శ్రీను (Boyapati Srinu), అట్లీ, సురేంద్ రెడ్డి (Surender Reddy) వంటి దర్శకులతో బన్నీ సినిమాలు చేయనున్నట్లు సమాచారం.  అయితే ‘పుష్ప 2’ మూవీ తర్వాత ముందుగా డైరెక్టర్‌ అట్లీతో బన్నీ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సినిమాను కూడా అట్లీ.. పాన్‌ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నారట. ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)తో ‘జవాన్‌’ (Jawan) తీసిన అట్లీ.. పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత బన్నీతో సినిమా తీయనుండటంతో ఇప్పటి నుంచే మూవీపై అంచనాలు మెుదలయ్యాయి.

     

    టీమ్‌తో అట్లీ చర్చలు.. వీడియో వైరల్‌!

    బన్నీ – అట్లీ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మెుదలైనట్లు తెలుస్తోంది. తాజాగా డైరెక్టర్ అట్లీ (Director Atlee) తన టీమ్‌తో కలిసి డిస్కషన్‌ చేస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ఆ డిస్కషన్‌ బన్నీ మూవీకి సంబంధించే జరిగిందని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆ వీడియోను బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఈ బన్నీ-అట్లీ కాంబోలో మూవీ కోసం తాము ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘పుష్ప’ చిత్రానికి మించి ఈ సినిమా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. 

    ఆ హీరోయిన్‌గా హ్యాట్రిక్‌!

    అట్లీ డైరెక్షన్‌లో రానున్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) పేరును పరిశీలిస్తున్నారట. బన్నీకి జోడీగా పూజా సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. పాత్రకు కూడా ఆమె బాగా సెట్‌ అవుతుందని అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఇప్పటికే బన్నీ – పూజా హెగ్డే కాంబోలో రెండు చిత్రాలు వచ్చాయి. ‘దువ్వాడ జగన్నాథం’ (Duvvada Jagannadham), ‘అలా వైకుంఠపురంలో’ (Ala Vaikuntapurramuloo) వీరిద్దరు జంటగా చేశారు. వీరు పెయిర్‌ బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇక సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనిరుధ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

    అట్లీకి భారీ రెమ్యూనరేషన్‌!

    బన్నీతో మూవీ కోసం డైరెక్టర్‌ అట్లీ.. గట్టిగానే రెమ్యూనరేషన్‌ను డిమాండ్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన రీసెంట్‌ మూవీ ‘జవాన్‌’ (Jawan) సూపర్‌ సక్సెస్‌ కావడంతో అల్లు అర్జున్‌ చిత్రం కోసం అట్లీ ఏకంగా రూ.60 కోట్లు కావాలన్నాడట. మేకర్స్‌ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. దర్శకుడికే రూ.60 కోట్లు ఇస్తే బన్నీకి ఇక ఏ రేంజ్‌లో రెమ్యూనరేషన్‌ ముట్టనుందోనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv