అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. తక్కువ స్థలంలో పెట్టుకోగలిగిన పోర్టబుల్ ఫ్రిడ్జ్‌ల నుంచి ఫ్యామిలీ, కమర్షియల్ పర్పస్‌లో ఉపయోగించుకునే భారీ నిల్వ సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లపై ఆఫర్లు ఉన్నాయి. అయితే గృహ అవసరాల నిమిత్తం మంచి ఫీచర్లు, కెపాసిటీ ఉన్న రిఫ్రిజిరెటర్లు ఎంతైన అవసరం. అవసరాన్ని బట్టి, ప్యామిలీ కెపాసిటీని బట్టి రిఫ్రిజిరేటర్లను ఎంచుకుంటే మంచిది. మరి ఈ ఫ్రిడ్జ్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఓసారి లుక్ వేయండి.
Godrej 30 L Qube
పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లు తీసుకోవాలనుకునే వారికి Godrej 30 L Qube బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇళ్లు, కార్యాలయాలు, చిన్న చిన్న షాపులు ఎక్కడైన దీనిని సులభం పెట్టుకోవచ్చు. ఇది అధునాతన సాలిడ్ స్టేట్ టెక్నాలజీతో వస్తుంది. ఫాస్ట్ కూలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్‌పై ఒక సంవత్సరం వారెంటీ అయితే లభిస్తుంది. దీని ధర రూ. 7,790. బ్యాంకు ఆఫర్ ద్వారా ఇంకా తక్కువకే కొనుగోలు చేయవచ్చు.
Haier 42 L
ఎలక్ట్రానిక్ వస్తువుల్లో Haier బ్రాండ్‌కు మంచి గుర్తింపు ఉంది. పోర్టబుల్ రిఫ్రిజిరెటర్లలో Haier 42 L సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇది 5 స్టార్ రెటింగ్‌ను కలిగి ఉంది విద్యుత్‌ను ఆదా చేస్తుంది. దీని కూలింగ్ కంప్రెషర్‌పై 5 ఏళ్ల వారెంటీ లభిస్తోంది. దీంట్లో నీళ్లు, డ్రింక్స్‌తో పాటు ఆహారాన్ని కూడా పెట్టుకోవచ్చు. సింగిల్ డోర్‌తో ఈ రిఫ్రిజిరేటర్ వస్తోంది. చూసేందుకు స్టైలిష్‌గా.. అట్రాక్ట్ చేస్తుంది. దీంట్లో ప్రత్యేకంగా ఫ్రీజర్ కూడా ఉంది. దీనికి సంవత్సరం వారెంటీ కూడా లభిస్తుంది. అమెజాన్ రివ్యూ రెటింగ్లో 4.3 స్టార్స్ అయితే ఉన్నాయి. దీని ధర రూ. 9,999
శాంసంగ్ రిఫ్రిజిరేటర్
ఇద్దరు లేదా ముగ్గురు ఉన్న కుటుంబానికి శామ్సంగ్ 183 లీటర్ల సామర్థ్యం ఉన్న ఫ్రిడ్జ్ సరిగ్గా సరిపోతుంది. ఇది 2 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. కూలింగ్ కంప్రెసర్‌పై 20 ఏళ్ల వారెంటీని అందిస్తన్నారు. దీని డీఫ్రీజ్ కెపాసిటి 18 లీటర్లు కాగా.. రెండు షెల్వ్స్ను కలిగి ఉంటుంది. దీని ధర ₹14,890
Godrej 180L
తక్కువ ధరలో మంచి కంపెనీ ఫ్రిడ్జ్ కావాలనుకునే వారికి Godrej 180 రిఫ్రిజిరేటర్ మంచి ఎంపిక. టర్బో కూలింగ్ టెక్నాలిజీతో వస్తుంది. ఇది గోద్రేజ్ బ్రాండ్ నుంచి వచ్చిన లెటెస్ట్ మోడల్. 4 స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. కంప్రెసర్‌పై 10 ఏళ్లు, ఓవరాల్ ప్రొడక్ట్‌పై ఒక సంవత్సరం వారెంటీ ఉంది.
Samsung 189 L
5 స్టార్ రెటింగ్‌తో Samsung 189 L సామర్థ్యం ఉన్న ఈ ఫ్రిడ్జ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఫ్రీజర్ కెపాసిటీ 17 లీటర్లు, యాంటీ బాక్టీరియల్ గ్లాస్కెట్, రెండు షెల్వ్స్ ఫ్రిడ్జ్ కంపార్టుమెంట్ కలిగిఉంటుంది. కంప్రెసర్‌పై 20 ఏళ్ల వారెంటీ, ప్రొడక్ట్‌పై 1YR వారెంటీ ఇస్తున్నారు. దీని ధర రూ. 17,490
గోద్రేజ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్
తక్కువ ధరలో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలనుకునే వారికి Godrej 223 L బెస్ట్ ఆప్షన్. ఇది 2 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. ఫ్రోస్ట్ ప్రీ టెక్నాలిజీ దీని ప్రత్యేకత. కంప్రెసర్‌పై 10 ఏళ్లు వారెంటీ.. ప్రొడక్ట్‌పై ఒక ఏడాది వారెంటీ లభిస్తుంది. దీని ధర రూ. 19,999. బ్యాంకు ఆఫర్ల ద్వారా ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
LG 242 L 2 Star Frost-Free
స్మార్ట్ ఇన్వర్టర్ కలిగిన డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది. దీన కెపాసిటీ 300 లీటర్లు. ముగ్గురు నుంచి నలుగురు ఉన్న కుటుంబానికి బాగా సరిపోతుంది. 2 స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంది. కంప్రెసర్‌పై 10 ఏళ్లు వారెంటీ, ప్రొడక్ట్‌పై 1YR వారెంటీ లభిస్తుంది. ఇది అమెజాన్‌లో రూ. 23,990 వద్ద అందుబాటులో ఉంది. నెలకు రూ.1,163 EMI చెల్లించి సొంతం చేసుకోవచ్చు.
Samsung 236 L
తక్కువ ధరకే ఈ డబుల్ డోర్ ఫ్రిజ్‌ను సొంతం చేసుకోవచ్చు. శామ్సంగ్ నుంచి వచ్చిన లెటెస్ట్ మోడల్ ఇది. కూలింగ్ హెచ్చు తగ్గులను డిజిటర్ డిస్ప్లే ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. 20 ఏళ్లు ఇన్వర్టర్ కంప్రెసర్‌పై, ఏడాది ప్రొడక్ట్ వారెంటీ లభిస్తోంది. 2 స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంది. 54 లీటర్ల ఫ్రీజర్ కెపాసిటి దీని ప్రత్యేకత. 4-5 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కుటుంబానికి బాగా సరిపోతుంది. దీని ధర రూ. ₹24,690.
Whirlpool 240 L Protton
ఇది ట్రిపుల్ డోర్ ఫీచర్‌తో మెరుగైన కూలింగ్ టెక్నాలిజీతో తయారైంది. తక్కువ ధరలో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. 240 లీటర్ల నిల్వ స్థలం కలిగిఉంది. జియోలైట్ టెక్నాలజీ, మాయిశ్చర్ రిటెన్షన్ టెక్నాలజీ, ఫ్రూట్ క్రిస్పర్, ఎయిర్ బూస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఎనర్జీ రేటింగ్‌ను కలిగి లేదు. దీని ధర ₹26,990. బ్యాంకు ఆఫర్ల ద్వారా ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
Samsung 244 L 3 Star Frost-Free
శాంసంగ్ నుంచి డబుల్ డోర్‌తో అత్యాధునిక ఫీచర్లతో వచ్చని కొత్త ప్రొడక్ట్ ఇది. 3 స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. బేస్ స్టాండ్, ఫ్రోస్ట్ ఫ్రీ టెక్నాలజీ, కర్డ్ మస్ట్రో వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కూలింగ్ కంప్రెసర్‌పై 20 ఏళ్ల వారెంటీని కలిగి ఉంది. 244 లీటర్ల నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ఇది అమెజాన్‌లో ₹27,490 వద్ద అందుబాటులో ఉంది.
Samsung 265 L 3 Star Inverter Frost Free
డబుల్ డోర్‌తో 265 లీటర్ల నిల్వసామర్థ్యంతో వచ్చింది. ఇది 3-4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కుటుంబానికి బాగా సరిపోతుంది. 3 స్టార్ ఎనర్జీ రేటింగ్, ఫ్రోస్ట్ ప్రీ టెక్నాలజీ కలిగి ఉంది. కంప్రెసర్‌పై 20 ఏళ్ల వారెంటీ, ప్రోడక్ట్‌పై 1YR వారెంటీ అయితే అందిస్తున్నారు. దీని ధర ₹29,900
Panasonic 309 L 3 Star Prime
అమెజాన్‌లో లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ కింద తక్కువ ధరకే ఈ రిఫ్రిజిరెటర్ లభిస్తోంది. డబుల్ డోర్‌తో వస్తున్న ఈ ఫ్రిడ్జ్.. వెరైటీ ఆఫ్ కూలింగ్ మోడ్స్‌ను కలిగి ఉంది. పెద్ద ఫ్యామిలీకి ఇది మంచి ఎంపిక. కంప్రెసర్‌పై 10 ఏళ్లు వారెంటీ, ప్రొడక్ట్‌పై ఒక సంవత్సరం వారెంటీ లభిస్తోంది. స్టార్ ఎనర్జీ రేటింగ్ లేదు. దీని ధర రూ. ₹32,990
Bosch MaxFlex Convert 332L
పెద్ద కుటుంబాలకు Bosch MaxFlex మంచి ఎంపిక. ఇది 332 లీటర్ల నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ట్రిపుల్ డోర్ ఫెసిలిటీతో మెరుగైన కూలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రిమియం లుక్, మంచి బాడీతో బిల్ట్ అయి ఉంటుంది. ఎనర్జీ స్టార్ రేటింగ్ లేదు. ప్రొడక్ట్‌పై ఏడాది వారెంటీ లభిస్తుంది. దీని ధర రూ. ₹37,990. నెలకు EMI ₹1,842 ద్వారా దీనిని సొంతం చేసుకోవచ్చు.
Voltas Beko 470 L
470 లీటర్ల భారీ నిల్వ సామర్థ్యంతో.. 2 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. హౌస్, కమర్షియల్ పర్పస్‌లో యూజ్ చేసుకోవచ్చు. డబుల్ డోర్‌తో వస్తుంది. 12 ఏళ్ల పాటు కంప్రెసర్ వారెంటీ, ఏడాది పాటు ప్రొడక్ట్‌పై వారెంటీ లభిస్తుంది. నియో ఫ్రోస్ట్ ఫ్రీ టెక్నాలజీ కలిగి ఉంది. దీని ధర ₹38,890
Bosch Maxflex 364L
ప్రీమియం బాడీ బిల్ట్‌తో కూలింగ్ కోసం మూడు ప్రత్యేకమైన విభాగాలను కలిగి ఉంటుంది. దీర్ఘకాలం తాజాదనం కోసం వీటాఫ్రెష్ క్రిస్పర్ బాక్స్‌ను కలిగి ఉండటనం దీని అదనపు ప్రత్యేకత. 364 నిల్వ సామర్థ్యం డబుల్ డోర్‌ను కలిగి ఉంది. దీన ధర ₹43,900. బ్యాంకు ఆఫర్ల ద్వారా ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవచ్చు.
Hisense 564 L
వాణిజ్యపరంగా , 5 మంది కంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే కుటుంబానికి ఇది మంచి ఎంపిక. ఈ ఫ్రిడ్జ్ 564 లీటర్ల భారీ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. హైడ్యూరబుల్ బాడీ బిల్ట్‌తో పాటు వాటర్ డిస్పెన్సర్‌ను కలిగి ఉంది. స్పిల్ ఫ్రూ, అడజస్టబుల్ గ్లాస్ షెల్వ్స్ దీని ప్రత్యేకతలు. కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారెంటీ, ప్రొడక్ట్‌పై ఏడాది పాటు వారెంటీ లభిస్తోంది. దీని ధర రూ. 45,990
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!