బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ (Amyra Dastur) తన అందచందాలతో దడ పుట్టిస్తోంది. ఎద పొంగులను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెడుతోంది.
తాజాగా ఫొటోలకు ఫోజులిచ్చిన ఈ భామ.. గోధుమ రంగు డిజైనర్ జాకెట్లో హోయలు పోయింది. చున్నీని చేతికి చుట్టి మరి అందాల ప్రదర్శన చేసింది.
మ్యాచింగ్ హారం, చమ్కీలు ధరించి నెటిజన్ల మతి పోగొట్టింది. ప్రస్తుతం ఈ భామ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అమైరా దస్తూర్‌ను ఇలా చూస్తుంటే పాలరాతి శిల్పమే గుర్తుకు వస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అమైరా దస్తూర్ (Amyra Dastur) వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె 07 మే, 1993లో జన్మించింది. ముంబయిలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.
కెరీర్లో ప్రారంభంలో మోడల్‌గా పనిచేసినా ఈ భామ.. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
2013లో మనీష్ తివారి దర్శకత్వంలో వచ్చిన ‘ఇసాక్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేత్రం చేసింది. ఆ తర్వాత తమిళంలో ధనుష్ పక్కన ‘అనేగన్’ మూవీలో నటించింది.
ఆ చిత్రం తెలుగులో ‘అనేకుడు’ పేరుతో డబ్బింగ్ అయ్యింది. కమర్షియల్‌గా ఈ సినిమా హిట్ కాలేదు. కానీ, అమైరా (Amyra Dastur) నటనకు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
ఆ తర్వాత హిందీలో మిస్టర్ ఎక్స్ (Mr. X) ఈ బ్యూటీ.. ఆపై జాకీచాన్‌తో ‘కుంగ్ ఫూ యోగా’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
2018లో ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో నటించి మరోమారు వెండి తెరపై మెరిసింది. ‘మనసుకు నచ్చింది’, ‘రాజు గాడు’ చిత్రాల ద్వారా మరోమారు టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.
ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు దక్కలేదు. దీంతో అమైరా తన ఫోకస్ మెుత్తం బాలీవుడ్‌పై పెట్టింది.
అక్కడ వరుస సినిమాలతో (Amyra Dastur) బాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. వరుస సినిమాలతో వారికి మరింత దగ్గరైంది.
అమైరా వరుసగా ‘జడ్జ్‌మెంటల్ హై క్యా’, ‘ప్రస్థానం’, ‘మేడ్ ఇన్ చైనా’, ‘కోయీ జానే నా’, ‘జోగి’ వంటి చిత్రాల్లో తళుక్కుమంది.
గతేడాది ప్రభుదేవ సరసన బఘీరా చిత్రంలో ఆమె నటించింది. పంజాబీలో ‘ఎనీ హౌ మిట్టి పావ్’ ప్రస్తుతం ఆమె నటిస్తోంది.
ఈ భామ పలు బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లలోనూ మెరిసింది. 2018లో ‘ది ట్రిప్ 2’ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత ‘తాండవ్’ సిరీస్‌లో అడా మిర్ పాత్ర, బొంబాయ్ మేరి జాన్ సిరీస్‌లో పారి పటేల్ పాత్రలో కనిపించి ఓటీటీ ప్రేక్షకులను అలరించింది.
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ అమైరా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఉల్లాసపరుస్తోంది.