• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచు విష్ణుకి ‘జారుమిఠాయా’ విషెస్

    [VIDEO:](url) నేడు నటుడు మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా విష్ణు సోదరుడు మనోజ్ అన్నయ్యకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇటీవల విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జంబలకడి జారు మిఠాయా’ పాట బాగా ఫేమస్ అయింది. ఈ పాట పాడిన భారతిని మంచు మనోజ్ కలిశాడు. ఈ పాటను ఆమెతో పాడిస్తూ సోదరుడికి మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. సానుకూలంగా ఆలోచించాలని, ఆరోగ్యంగా మెలగాలని అన్నయ్యకు సూచించాడు. కాగా, జిన్నా సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. … Read more

    అదిరిపోయింది.. ఈ ‘బాస్ పార్టీ’

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘బాస్ పార్టీ’ అంటూ సాగుతున్న ఈ పాట హోరెత్తిస్తోంది. నకాశ్ ఆజిజ్, దేవీ శ్రీ ప్రసాద్, హరిప్రియ ఈ పాటను ఆలపించారు. డీఎస్పీ సంగీతం ఇరగదీశాడు. మాస్ బీట్‌కి చిరు స్టెప్పులు తోడవ్వడంతో పాట మరోస్థాయికి వెళ్లింది. ఈ పాటను డీఎస్పీ లిరిక్స్ అందించడం విశేషం. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. హీరో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘డీజే వీరయ్య’గా … Read more

    శునకం..అశ్వం.. ఓ మహిళ..!

    [VIDEO:](url) అప్పుడే తెలవారుతోంది. సూర్యుడు ఒళ్లు విరిచి తూర్పున ఉదయించేందుకు సిద్ధమవుతున్న వేళ ఓ శునకం, అశ్వం, మహిళ.. అలా రోడ్డుపై కలిసి ప్రయాణిస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. ఆ మహిళ స్కేటింగ్ చేస్తూ రోడ్డుపై ప్రయాణిస్తుంటే ఆమె వెంట గుర్రం, శునకం పరుగెత్తడం చూపరులకు ఆహ్లాదం కలిగించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘వాటి మధ్యనున్న అనుబంధం ఎంత మధురమైందో. అసలైన ఆనందం అంటే ఇదే’ అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమకూ ఇలా చేయాలని ఉందని … Read more

    న్యూయార్క్‌లో హిమపాతం.. ఇద్దరు మృతి

    అమెరికా నగరం న్యూయార్క్ మంచు దుప్పట్లో కూరుకుపోయింది. హిమపాతం ధాటికి ఏకంగా ఇద్దరు మృతి చెందారు. రానున్న 24 గంటల్లో అధిక హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని చోట్ల ఆరడగుల మేర హిమపాతం కురుస్తోంది. పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. రహదారులు మంచుతో కప్పుకుపోయాయి. వాహనాల రాకను అధికారులు నిషేధించారు. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. Very rare thundersnow in Buffalo, NY: pic.twitter.com/Ps4fZEe8iV — … Read more

    అఫ్తాబ్‌ను ఉరి తీయాలి: సీఎం

    [VIDEO:](url) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియురాలు శ్రద్ధా వాకర్ కేసులో ప్రియుడు అఫ్తాబ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ స్పందించారు. ‘మన దేశానికి కావాల్సింది అఫ్తాబ్ లాంటి వారు కాదు. ఒక రాముడు కావాలి. ప్రధాని మోదీ లాంటి నాయకుడు కావాలి. అది కావాలంటే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలి. లవ్ జిహాద్‌కి వ్యతిరేకంగా చట్టం తేవాలి. తద్వారా అఫ్తాబ్ లాంటి దోషుల్ని ఉరితీయాలి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో జరిగిన ఓ రోడ్ … Read more

    త్రిష పెదాలపై ముద్దు పెట్టిన బుడ్డోడు

    [VIDEO:](url) వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ‘త్రిష’. తాజాగా ఈ అమ్మడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్-1’లో నటించింది. కుందవై పాత్రలో అటు అందంతో, ఇటు నటనతో ప్రేక్షకుల మదిని దోచేసింది. అయితే, ఈ భామ పెదాలపై ఓ బుడ్డోడు ముద్దు పెట్టేశాడు. కాకపోతే నేరుగా కాదు.. పోస్టర్‌పై. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై త్రిష స్పందించింది. ట్విటర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేస్తూ.. లవ్ సింబల్ జతచేసింది. ?❤️ pic.twitter.com/NRbX4OesXG — … Read more

    10వేల అడుగుల ఎత్తులో స్కై డైవింగ్

    [VIDEO:](url) ఆర్మీ ఉద్యోగిని లాన్స్ నాయక్ మంజు అరుదైన ఘనత సాధించారు. 10వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి రికార్డు సృష్టించారు. ఏఎల్‌హెచ్ ధ్రువ హెలికాప్టర్‌లో మంజు ఇద్దరు స్కై డైవర్లతో కలిసి నింగిలోకి ఎగిరారు. 10వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక అక్కడి నుంచి జంప్ చేశారు. పారాచూట్ సహాయంతో నేలపై సురక్షితంగా దిగారు.. దీంతో భారత సైన్యంలో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా మంజు నిలిచారు. ‘తన రెక్కలపై విశ్వాసముంచితే పక్కి ఆకాశపు హద్దుల్ని చూడగలదు’ అని మంజు … Read more

    బట్టుబొమ్మ ఇంటిని చూశారా..!

    హీరోయిన్ ‘పూజా హెగ్దే’ గతేడాది ముంబయిలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, హోం టూర్‌లో భాగంగా ఈ బుట్టబొమ్మ తన ఇంటిని చూపించింది. తన అభిరుచులకు అనుగుణంగా ఇంటిని డిజైన్ చేయించుకున్నానని పూజా తెలిపింది. ఓపెన్ కిచెన్ అంటే ఇష్టమని, కారిడార్ స్ఫూర్తి కలిగించేలా ఉండాలని అభిప్రాయపడింది. వర్క్‌స్పేస్‌ని చూపిస్తూ.. ట్రెండీ క్లాసీ లుక్కులో కనిపించడం తనకిష్టమనిచెప్పింది. లండన్, న్యూయార్క్ నగరాల్లోని స్టైల్ ఉట్టిపడేలా తన ఇంటిని తీర్చిదిద్దానని చెప్పింది.

    SRH తర్వాతి కెప్టెన్ ఇతడేనా..?

    సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు కెప్టెన్ వేటలో పడింది. గత సీజన్ వరకు సారథిగా వ్యవహరించిన విలియమ్సన్‌ని జట్టు వదులుకుంది. ఈ క్రమంలో జట్టు తర్వాతి కెప్టెన్‌గా పంజాబ్ ప్లేయర్ అభిషేక్ శర్మను తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. తాజాగా, అభిషేక్ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘వీర శూర’ అనే కామెంట్ కూడా జత చేయడంతో ఈ ఊహాగానాలకు ఊతమిచ్చినట్లు అయింది. గత సీజన్‌లో అభిషేక్ శర్మ ఇరగదీశాడు. 400కు పైగా పరుగులు చేశాడు. అమృత్‌సర్ … Read more

    చిత్తూరులో బావిలో పడ్డ ఏనుగు

    [VIDEO](url): APలోని చిత్తూరు జిల్లా గుండ్లపల్లి గ్రామంలో బావిలో పడిన ఏనుగుని అధికారులు రక్షించారు. సోమవారం రాత్రి ఇటుగా వచ్చిన ఏనుగు నీటిబావిలో పడిపోయింది. నేడు ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానిక జేసీబీ సిబ్బంది సాయంతో బావి గోడను ఒకవైపు తొలగించారు. ఏనుగుకు ఎక్కేందుకు అనువుగా ఉండటానికి మట్టిని తొలగించారు. చాలా సేపటి తర్వాత ఏనుగు అందులో నుంచి పైకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. #WATCH | An elephant that fell into … Read more