• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నోరా చేతిలో త్రివర్ణ పతాకం

    [VIDEO:](url) బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఫిఫా వరల్డ్‌కప్ ఫ్యాన్ ఈవెంట్‌లో తళుక్కుమంది. స్టేజిపై ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. దోహాలో జరిగిన ఈ కార్యక్రమలో నోరా ఫతేహి బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసింది. అనంతరం భారతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని రెపరెపలాడిస్తూ ‘జైహింద్’ అని నినాదాలు చేసింది. అక్కడున్న వారితోనూ ‘జై హింద్’ అని నినాదాలు చేయించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫిఫా ఈవెంటులో భారత్ తరఫున్ నోరా ప్రాతినిథ్యం వహించింది. అంతకుముందు ఇంటర్నేషనల్ ర్యాపర్ నిఖి మినజ్‌తో … Read more

    సింహంతో వ్యక్తి ముద్దులు.. వీడియో వైరల్

    [VIDEO:](url) సింహాన్ని దూరం నుంచి చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి ఓ వ్యక్తి మాత్రం సింహంతో క్లోజ్ ఫ్రెండ్‌లా వ్యవహరిస్తున్నాడు. తన చేతిల్లోకి సింహం తలను తీసుకుని ముద్దాడుతున్నాడు. దీనికి ఆ సింహం కూడా సహకరిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడు ఇతడే’ అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరేమో ఇది అసలైన వీడియో కాదని చెబుతున్నారు. సింహం క్రూర … Read more

    ట్విటర్‌లో షర్మిల vs కవిత

    తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య నెట్టింట మాటల యుద్ధం నడుస్తోంది. తనకు మద్దతుగా నిలిచిన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కృతజ్ఞతలు చెబుతూ షర్మిల ట్వీట్ చేశారు. దీంతో ‘‘తాము వదిలిన ‘బాణం’.. తానా అంటే తందానా అంటున్న ‘తామర పువ్వులు’’’ అని కవిత కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్‌కి బదులుగా ‘‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం … Read more

    ఇజ్రాయెల్ దర్శకుడిపై అనుపమ్ ఖేర్ ఆగ్రహం

    [VIDEO:](url) కశ్మీరీ ఫైల్స్‌పై ఇజ్రాయెల్ దేశ దర్శకుడు నవడ్ ల్యాపిడ్ వ్యాఖ్యలను నటుడు అనుపమ్ ఖేర్ ఖండించారు. నిజాన్ని చూడలేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిజాన్ని చూడలేకపోతే కళ్లు, నోరు మూసుకోండి. ఇది మా దేశంలో ఒక విషాద చరిత్ర. కావాలంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోండి. భారత్, ఇజ్రాయెల్ మిత్ర దేశాలు. రెండూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. కశ్మీరీ హిందువుల బాధను ఇజ్రాయెల్‌లో సామాన్యుడూ అర్థం చేసుకోగలడు. అయితే, ప్రతి దేశంలోనూ దేశద్రోహులు ఉంటారు కదా’ అని ఇన్‌స్టాగ్రాం వీడియో ద్వారా … Read more

    మీ అభిమానం గొప్పది: మహేశ్ బాబు

    నాన్న తనకెంతో ఇచ్చారని, అన్నింటికన్నా గొప్పది ఫ్యాన్స్ అభిమానమని మహేశ్ బాబు వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ పరమదించి 13రోజులు పూర్తయిన నేపథ్యంలో వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాన్నెంతో ఇచ్చారు. వాటిల్లో గొప్పనైనది మీ అభిమానం. ఆయనకు ఎంతో రుణపడి ఉంటాను. మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. నాన్న మన గుండెల్లోనే ఉంటారు. మన మధ్యే ఉంటారు’ అని మహేశ్‌బాబు చెప్పారు. మళ్లీ జన్మలో కూడా ఆయన అల్లుడిగానే పుట్టాలని నటుడు సుధీర్ బాబు ఎమోషనల్ … Read more

    దూసుకొచ్చిన పులి.. వీడియో వైరల్

    [VIDEO:](url) ‘పులిని దూరం నుంచి చూడాలనిపిస్తే ఏం కాదు. కానీ, పులికి ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు అస్సలు చేయొద్దంటారు. ఇలాంటి ఘటనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంగిల్ సఫారీలో భాగంగా పర్యటకులు పులి ఉన్న ప్రదేశంలో జీపుని ఆపి.. ఆ చిత్రాలను బంధించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పులి వీరిపై దాడి చేసేందుకు మీది మీదికొచ్చింది. అప్రమత్తమైన డ్రైవర్ జీపుని ముందుకు కదల్చడంతో పులి తిరిగి వెనక్కి వెళ్లింది. ‘పులిని చూడటానికి మనం కనబర్చే అత్యుత్సాహం.. వాటి జీవితంలోకి చొరబడేలా ఉంటుంది’ … Read more

    వరంగల్‌లో షర్మిల అరెస్టు

    [VIDEO:](url) వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగనున్న దృష్ట్యా ఆమెను చెన్నారావుపేట శంకర తండా వద్ద అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమె కేరవాన్‌కి తెరాస కార్యకర్తలు నిప్పు పెట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై షర్మిల స్పందించారు. తన పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇలా చేయించారని ఆరోపించారు. Few people alleged to … Read more

    ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ ట్రైలర్

    బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. ఐదు విభిన్న స్టోరీల సమాహారంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. ప్రేమ, అనుబంధాల కలబోతతో ముడిపడిన జీవితాలను ప్రస్ఫుటం చేసేలా ఉన్న ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్, ప్రశాంత్ విహారీ ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టికెట్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.

    ధమాకా నుంచి మరో పాట విడుదల

    రవితేజ హీరోగా డ్యుయల్ రోల్‌లో వస్తున్న చిత్రం ‘ధమాకా’. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘డు..డు..వీడు ల్యాండుమైను లెక్క’ అంటూ సాగే ఈ పాటను పృథ్వీ చంద్ర ఆలపించారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. కాగా, ఈ సినిమాలోని మిగతా పాటలకు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. డిసెంబరు 23న మూవీ రిలీజ్ కానుంది.

    జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న కోహ్లీ

    [VIDEO:](url) న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రారంభమయ్యే బంగ్లా సిరీస్‌లో వీరు పాల్గొనున్నారు. ఈ క్రమంలో జిమ్‌లో ఈ ఇరువురు ప్లేయర్లు వర్కవుట్లు చేస్తున్నారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతున్న వీడియోను కోహ్లీ పంచుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, రోహిత్ శర్మ కూడా జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు. కాగా, రేపటి నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా వన్డే సిరీస్‌ని ప్రారంభించనుంది. View this post on Instagram A post … Read more