• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైరల్ అవుతున్న మహేశ్ వీడియో

    [VIDEO:](url) సూపర్ స్టార్ కృష్ణ మృతికి నెట్టిళ్లు కూడా శోక సంద్రమైంది. కృష్ణ గురించి మహేశ్ బాబు చెప్పిన మాటల్ని అభిమానులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది తొలినాళ్లలో మహేశ్ తన సోదరుడిని కోల్పోయాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ బాబు.. అభిమానుల ప్రేమకు తరించిపోయాడు. ‘ఈ మధ్య నాకు బాగా దగ్గరగా ఉండేవారు ఉన్నట్టుండి దూరమయ్యారు. అయినా, మీ అభిమానం అలాగే ఉంది. ఇదొక్కటి చాలు నన్ను ముందుకు నడిపించడానికి’ అని మహేశ్ భావోద్వేగంతో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. రెండు … Read more

    అచ్చం అలాంటి పోజే..!

    [VIDEO:](url) ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. అయితే, ఓ మీమ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 2019లో డేవిడ్ వార్నర్ క్యాచ్ మిస్ చేసిన సమయంలో ఓ వ్యక్తి పెట్టిన పోజు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అచ్చం అలాంటి పోజే పాకిస్థాన్ ఇన్నింగ్సులో ఆవిష్కృతమైంది. పాక్ వికెట్ పడ్డాక ఇలా చేతిలో నడుముపై పెట్టుకుని విచారం వ్యక్తం చేయడం వైరల్ అయింది. ఈ వీడియోను ఐసీసీ నెట్టింట షేర్ చేస్తూ.. రెండూ దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయంటూ కామెంట్ … Read more

    ఆకట్టుకుంటున్న మూవీ టీజర్

    ‘నాంది’ సినిమా తర్వాత అల్లరి నరేష్ హీరోగా వస్తున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఓట్లు, ఎన్నికలు, రాజకీయం కథాంశంగా తెరకెక్కిన చిత్రమని టీజర్‌ని బట్టి అర్థమవుతోంది. ‘అన్యాయంగా బెదిరించేవాడి కన్నా.. న్యాయంగా ఎదిరించే వాడే బలమైనవాడు’ అంటూ సాగే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించగా, ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

    గమనిక.. ఈ 4 రోజులు అటు వెళ్లకండి

    [VIDEO:](url) దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా ఈ ప్రిక్స్ కారు రేసింగ్ నిర్వహిస్తుండటంతో ట్రాక్ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ 2.7కి.మీ. పొడవైన ట్రాక్ సిద్ధమైంది. అయితే, ఈ నెల 19, 20న తొలి విడత ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 10, 11న రెండో విడత ట్రయల్ చేపట్టనున్నారు. ఈ నాలుగు రోజులు ఎన్టీఆర్ మార్గ్‌ని మూసివేస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ట్రయల్ రన్‌ని వీక్షించేందుకు టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. వీక్షకులకు స్టాల్స్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. As … Read more

    డగౌట్‌లో ఏడ్చేసిన రోహిత్

    పాకిస్థాన్‌పై గెలుపుతో ప్రపంచకప్‌ని ఆరంభించిన ఇండియా నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. సెమీఫైనల్లో ఇంగ్లాండు చేతిలో ఓటమిని అటు క్రీడాకారులు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా కంటతడి పెట్టాడు. డగౌట్‌లో కూర్చుని కన్నీరు కార్చడం కెమెరా కంటికి చిక్కింది. ఈ [వీడియో](url) నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రోహిత్‌కు అండగా నిలుస్తున్నారు. ‘ఏడవకు రోహిత్. మేమంతా నీ వెనకే ఉన్నాం ఛాంపియన్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారత్‌పై ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో నెగ్గడం గమనార్హం. #RohitSharma? … Read more

    అంబులెన్సుకి దారిచ్చిన ప్రధాని

    అంబులెన్స్‌కి దారి ఇవ్వడానికి ప్రధానమంత్రి కాన్వాయ్‌ని పోలీసులు ఆపేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంగ్రా నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం తన కాన్వాయ్‌ని నిలిపి అంబులెన్సు కోసమని దారిచ్చారు. అంబులెన్సు వెళ్లిపోగానే ప్రజలకు ప్రధాని కారులో నుంచే అభివాదం చేస్తూ అక్కడి నుంచి బయలుదేరారు. ఈ [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలోనూ ప్రధాని ఇలా అంబులెన్సుకి దారిచ్చారు. #WATCH | Prime Minister Narendra Modi stopped his convoy to let … Read more

    ‘మందు తాగండి.. నీటిని మిగల్చండి’

    వివాదాస్పద వ్యాఖ్యలతో మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులు తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆ రాష్ట్ర ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నీటిని సంరక్షించాలంటే వినియోగాన్ని తగ్గించాలని చెబుతూనే.. దానికి బదులుగా మద్యం సేవించాలని ఎంపీ జనార్ధన్ మిశ్రా సూచించారు. ‘నీళ్లు లేక భూములు వట్టిపోతున్నాయి. నీటిని సంరక్షించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. అవసరమైతే మందు తాగండి. ధూమపానం చేయండి. ఏదైనా కానివ్వండి. కానీ, నీటిని మాత్రం వృథా చేయొద్దు. జల ప్రాముఖ్యతను ఇప్పటికైనా గుర్తించండి’ అంటూ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ … Read more

    హమ్మయ్య.. రోహిత్ శర్మకు ఏం కాలేదు..!

    ఈ నెల 10న ఇంగ్లాండ్‌తో భారత్ సెమీ ఫైనల్ పోరు జరగనున్న నేపథ్యంలో ఓ ఘటన భారత అభిమానులను కలవర పెట్టింది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ కుడి చేతికి బంతి తగిలింది. ఈ క్రమంలో నెట్స్‌లోనే రోహిత్ విలవిలలాడాడు. దీంతో అతడి గాయంపై సందేహాలు మొదలయ్యాయి. అదృష్టవశాత్తు రోహిత్ త్వరగానే కోలుకుని తిరిగి నెట్స్‌లోకి వచ్చాడు. అతడు మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో అటు అభిమానులు, ఇటు యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నట్టయింది. BREAKING:Good news … Read more

    బుడ్డోడి పర్ఫార్మెన్స్‌కి బన్నీ ఫిదా

    ‘ఊర్వశివో రాక్షసివో’ విజయోత్సవ వేడుకలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో ఈ వేడుక జరుగుతోంది. అయితే, ఈ వేడుకలో తన పర్ఫార్మెన్స్‌తో ఓ బాలుడు అందరినీ మెస్మరైజ్ చేశాడు. డయాస్‌పై డ్రమ్స్ వాయిస్తూ చెర్రీ స్వరూప్ అలరించాడు. దీంతో ఈ బుడ్డోడి ప్రదర్శనకు అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు. చప్పట్లు కొడుతూ బాలుడిని ఎంకరేజ్ చేశాడు. తన ప్రదర్శన ముగిసిన అనంతరం చెర్రీ ‘తగ్గేదెలే’ అంటూ డైలాగ్ చెప్పడంతో ఈ [వీడియో](url) చక్కర్లు కొడుతోంది. … Read more

    సరస్సులో కూలిన విమానం

    ఆఫ్రికాలోని టాంజానియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుకోబా నగరంలోని విక్టోరియా సరస్సులో విమానం కూలిపోయింది. ఎయిర్‌పోర్టుకి 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ప్రమాద సమయంలో విమానంలో 49మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన విపత్తు స్పందన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రెసిషన్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన విమానం దార్ ఎస్ సలాం నుంచి బుకోబాకు ఈ విమానం బయలుదేరినట్లు సమాచారం. Precision Air plane crashes into Lake Victoria … Read more